Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పిల్ల రాక్షసి' పాటలు అదుర్స్ ... వచ్చే నెల 4న రిలీజ్

'బిచ్చగాడు' తర్వాత శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్‌ పతాకంపై చదలవాడ పద్మావతి అందిస్తున్న మరో చిత్రం 'పిల్ల రాక్షసి'. మలయాళంలో ఘన విజయం సాధించిన 'ఆన్‌ మరియ కలిప్పిలాను' తెలుగులో 'పిల్ల రాక్షసి' ప

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (19:46 IST)
'బిచ్చగాడు' తర్వాత శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్‌ పతాకంపై చదలవాడ పద్మావతి అందిస్తున్న మరో చిత్రం 'పిల్ల రాక్షసి'. మలయాళంలో ఘన విజయం సాధించిన 'ఆన్‌ మరియ కలిప్పిలాను' తెలుగులో 'పిల్ల రాక్షసి' పేరుతో నవంబర్‌ 4న విడుదల చేస్తున్నారు. రచయిత భాషాశ్రీ మలయాళ చిత్రం తెలుగు అనువాదానికి మాటలు, పాటలు అందించారు. మోసగాడితో చిన్నారి చేసిన సావాసం ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే కాన్సెప్ట్‌తో రూపొందిన సినిమానే ఇది. ఈ సినిమా ఆడియో, ట్రైలర్‌‌లను హీరో నరేశ్‌ ప్రసాద్‌ ల్యాబ్‌‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.
 
హీరో నరేశ్‌ మాట్లాడుతూ బిచ్చగాడులాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులకోసం వందరోజులపాటు ఆడేలా చూసిన నిర్మాతల నుండి 'పిల్ల రాక్షసి' అనే సినిమా వస్తుందంటేనే వాళ్ళ అభిరుచి ఎంతబాగుందో అర్థమైపోతోంది. తెలుగులో విభిన్న కాన్సెప్టులతో వస్తున్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మళయాళంలో పెద్ద విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో  కూడా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు.
 
చదలవాడ తిరుపతి రావు మాట్లాడుతూ.. ఈ అమ్మాయి భవిష్యత్తులో శ్రీదేవిలా పెద్ద హీరోయిన్‌ అవుతుంది. పిల్ల రాక్షసి పెద్ద విజయాన్ని అందుకుంటుందని నేను కోరుకుంటున్నాను. హీరోయిన్‌ జాన్‌ కైప్పలిల్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా తెలుగులోకి తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది. మా అందరికీ నిజంగా లైఫ్‌ ఇచ్చింది. తెలుగులో ఈ సినిమా పెద్ద సక్సెస్‌ సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments