Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునీత ''రాగం'' అదిరింది.. షార్ట్ ఫిలిమ్ వీడియోకి 6 లక్షల వ్యూస్.. (Video)

గాయని సునీత తాజాగా ''రాగం'' అనే షార్ట్ ఫిలిమ్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా భర్తకు దూరంగా ఉంటూ రాణించలేకపోయినా.. అందం.. గాత్రంతో ప్రేక్షకులను మదిని కట్టిపడేసిన సునీత రాగంలో అద్భుతమైన నటన

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (12:27 IST)
గాయని సునీత తాజాగా ''రాగం'' అనే షార్ట్ ఫిలిమ్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా భర్తకు దూరంగా ఉంటూ రాణించలేకపోయినా.. అందం.. గాత్రంతో ప్రేక్షకులను మదిని కట్టిపడేసిన సునీత రాగంలో అద్భుతమైన నటనను కనబరిచింది. ఈ చిత్రాన్ని యూ ట్యూబ్‌లో అక్టోబర్ 7న విడుదల చేశారు.. హృద‌యాన్ని ట‌చ్ చేసే ఓ సింపుల్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. 
 
ఒంటరి మహిళ అనగానే సమాజం ఎలా చూస్తుంది.  పెళ్ల‌యి భ‌ర్త‌కు దూరంగా ఉండే మ‌హిళ విష‌యంలో చుట్టూ ఉన్న‌వాళ్లు ఎలా అపార్థం చేసుకుంటారు? అన్న ఓ రియ‌లిస్టిక్ పాయింట్‌తో ఈ లఘు చిత్రాన్ని ఎంతో హుందాగా ఆవిష్క‌రించారు. ఈ సినిమాకు తన వ్యక్తిగత జీవితానికి సంబంధమున్నట్లు గతంలో సునీత వెల్లడించింది. అందుకే షార్ట్ ఫిలిమ్‌లో నటించానని చెప్పుకొచ్చింది. 
 
ఈ సినిమాలో సునీత న‌ట‌న‌, ఆహార్యం, స‌హ‌జ‌సిద్ధ‌మైన న‌ట‌న‌ అందిరిని ఆకర్షించేలా చేసింది. ఇప్పటి వరకు ఈ షార్ట్ ఫిలిం వీడియోకి 6 లక్షల వ్యూస్ లభించగా ఇందులో సునీత నటనతో పాటు .. దర్శకుడు శ్రీ చైతు కథా కథనాలకు నెటిజన్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మీరూ ఈ షార్ట్ ఫిలిమ్‌ను చూడండి.. సునీత నటన ఎలా ఉందో కామెంట్ చేయండి.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి తొక్కిసలాట : క్రిమినల్స్ ముఠా నేతగా చంద్రబాబు : అంబటి రాంబాబు

12,500 మినీ గోకులాలు ప్రారంభించిన : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Video)

బెన్ఫిట్ షోలు రద్దు చేశారు సరే.. స్పెషల్ షో ప్రదర్శన ఏంటి : టీ హైకోర్టు ప్రశ్న

Pawan Kalyan: క్షమాపణ చెప్తే తప్పేంటి? అమ్మాయిల దగ్గర మగతనం చూపిస్తే నార తీస్తాం: పవన్ (video)

రోడ్డు నిర్మాణ పనులు - ప్రమాదస్థలిని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments