Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ నేపథ్యంలో మహేష్ బాబు - కొరటాల చిత్రం... ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్

''మిర్చి'', ''శ్రీమంతుడు'' సినిమాల‌తో టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌తో కొర‌టాల శివ తెర‌కెక్కించిన ''జ‌న‌తా గ్యారేజ్'' సైతం సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (12:03 IST)
'మిర్చి'', ''శ్రీమంతుడు'' సినిమాల‌తో టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌తో కొర‌టాల శివ తెర‌కెక్కించిన ''జ‌న‌తా గ్యారేజ్'' సైతం సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో కొర‌టాలకి టాలీవుడ్‌లో స్పీడుకు బ్రేకుల్లేవు. ఇక గ్యారేజ్ త‌ర్వాత కొర‌టాల శివ ప్రిన్స్ మ‌హేష్‌బాబుతో ఓ సినిమా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక కొరటాల సినిమాలో స‌మాజాన్ని ప్ర‌భావితం చేసే ఏదో ఒక మంచి అంశాన్ని ఆయ‌న చెపుతూ వ‌స్తున్నాడు. 
 
మిర్చి సినిమాలో పక్కవాళ్ళని ప్రేమిద్దాం.. పోయేదేముంది తిరిగి ప్రేమిస్తారంతే అన్నాడు. ఇక శ్రీమంతుడు సినిమాలో గ్రామాల ద‌త్త‌త అంశం చెప్పాడు. ఇక జ‌న‌తా గ్యారేజ్‌లో పర్యావరణాన్ని ప్రేమించండి.. పక్కవాడి కష్టంలో సాయపడటం వంటి అంశాలను తెరపైకి తెచ్చాడు. అలాగే తాను మహేష్ బాబుతో చేయబోయే సినిమా విష‌యానికి వ‌స్తే ''లవ్ యువర్ సెల్ఫ్- నిన్ను నువ్వు ప్రేమించుకో'' అనే అంశంతో ఈ సినిమా ఉంటుంద‌ని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
ఇప్పటికే మహేష్ కోసం పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో కూడిన ఓ పవర్ ఫుల్ కథని రెడీ చేశాడట కొరటాల. అంతేకాదు.. ఇందులో మహేష్‌ని 'ముఖ్యమంత్రి'గా చూపించనున్నాడట. ఈ సినిమాలో మహేష్‌కు జోడిగా ఇద్దరు హీరోయిన్స్‌ను పెడుతున్నాడట కొరటాల. ప్రస్తుతం ఆ ముద్దుగుమ్మల వేటలో ఉన్నాడు కొరటాల. ఓ హీరోయిన్‌గా 'నేను శైలజ' ఫేం కీర్తి సురేష్‌ని తీసుకునే ఛాన్సుంది. కాగా మరో హీరోయిన్ వెతుకులాటలో కొరటాల బిజీగా ఉన్నాడట. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments