Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్యా... కరోనా రక్కసి నుంచి బయటపడిన బాలీవుడ్ సింగర్

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (12:44 IST)
బాలీవుడ్ గాయని కనికా కపూర్ కరోనా రక్కసి నుంచి బయటపడ్డారు. ఆమెకు తాజాగా జరిగిన కరోనా వైరస్ పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. దీంతో ఆమెతో పాటు.. ఆమె కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. 
 
ఇటీవల లండన్ పర్యటనకు వచ్చిన బాలీవుడ్ సింగర్ కరీనా కపూర్‌కు ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. 
 
ఆమెకు మొత్తం ఐదు సార్లు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ ఐదింటిలోనూ ఆమెకు పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆమెతో పాటు.. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 
 
ఈ నేపథ్యంలో ఆమె చికిత్స పొందుతున్న లోక్నోలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో ఆరోసారి కరోనా పరీక్షలు నిర్వహించగా, వీటిలో నెగెటివ్ అని వచ్చింది. దీంతో ఆమె పూర్తిగా కోలుకుందని నిర్ధారించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 
 
అయితే, కనిక కపూర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ కనిక మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమెపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 
 
విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాలన్న అధికారుల ఆదేశాలను ఉల్లఘించడం, వైరస్‌ సోకినప్పటికీ నిర్లక్ష్య పూరితంగా పలు సోషల్ ఈవెంట్లకు హాజరవడంతో ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసులు బుక్‌ చేశారు. కాగా, దేశంలో కరోనా సోకిన బాలీవుడ్ తొలి సెలబ్రిటీ కనికా కపూర్ కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు- ఏకగ్రీవంగా ఐదుగురి ఎన్నిక

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments