Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్రపరిశ్రమలో లైంగిక వేధింపులు సర్వసాధారణం : గాయని చిన్మయి

ఠాగూర్
సోమవారం, 26 ఆగస్టు 2024 (16:37 IST)
చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశం మరోమారు తెరపైకి వచ్చిది. మలయాళ చిత్రపరిశ్రమలో సాగుతున్న లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిషన్ నివేదిక ఇవ్వడంతో ఈ అంశం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై గాయని చిన్మయి మాట్లాడుతూ, చిత్రపరిశ్రమలో లైంగిక వేధింపులు సర్వసాధారణని తెలిపారు.
 
ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, హేమ కమిటీలోని సభ్యులు, విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్లూసీసీ) సభ్యులకు సింగర్ హ్యాట్సాఫ్ చెప్పారు. సినీ పరిశ్రమకు చెడ్డ పేరు వచ్చిందని, ఇక్కడ లైంగిక వేధింపులు సర్వసాధారణం అని చాలామంది విశ్వసిస్తారని చెప్పారు. తమిళ పాటల రచయిత వైరముత్తు నుంచి తాను స్వయంగా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని, ఆ కేసులో తాను పోరాడుతూనే ఉన్నానని తెలిపారు. 
 
చాలా చిత్ర పరిశ్రమల్లో నేరస్తులు కలిసి పనిచేస్తారని పేర్కొన్నారు. ఆమె దీనిని 'అధికారం, రాజకీయాలు, డబ్బు బంధం'గా అభివర్ణించారు. సినీ పరిశ్రమలోని వ్యక్తులతో రాజకీయ సంబంధాలు నేరస్తులకు శిక్ష పడకుండా అడ్డుకుంటున్నాయని అన్నారు. మనం ఓ సమస్య గురించి ఫిర్యాదు చేసినా, కేసు నమోదు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కేసు సంవత్సరాలు, దశాబ్దాలపాటు సాగుతుందన్నారు. తాను ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్టు చెప్పారు. ఏడేళ్లు అయినా ఆ కేసు ఎక్కడుందో ఇప్పటికీ తనకు తెలియదని వాపోయారు. 'నేను వేధింపులకు గురయ్యానని చెప్పాను. ఇండస్ట్రీలో ఇక నిన్ను పనిచేయనివ్వబోమని వారు చెప్పారు' అని చిన్మయి చెప్పుకొచ్చారు. అధికారం, రాజకీయాలు, డబ్బు పెనవేసుకుంటే జరిగేది ఇదేనని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

తర్వాతి కథనం