Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్... పడక సుఖం ఇస్తేనే సినిమా ఛాన్స్ : సనమ్ శెట్టి

Advertiesment
sanam shetty

ఠాగూర్

, బుధవారం, 21 ఆగస్టు 2024 (11:27 IST)
మాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ అంశం మరోమారు తెరమీదకు వచ్చింది. ఈ అంశం మళ్లీ సౌత్ ఇండియా వ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. తమిళ నటి సనమ్ శెట్టి కోలీవుడ్‌లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందంటూ తాజాగా ఆరోపణలు చేసింది. దర్శక నిర్మాతల నుంచి సమస్యలు ఎదురవుతాయని ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ఆమె చెప్పింది.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, అన్ని రంగాల్లోనూ మహిళలు వేధింపులను ఎదుర్కొంటున్నారని, మలయాళీ చిత్ర పరిశ్రమలోని నటీమణులు ఎదుర్కొంటున్న క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఉద్దేశించి ఇటీవల జస్టిస్‌ హేమ కమిటీ ఓ నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చిందన్నారు. ఆ నివేదిక గురించి తెలిసి తాను షాకైనట్టు చెప్పారు. అదేవిధమైన పరిస్థితులు తమిళ చిత్ర పరిశ్రమలోనూ ఉన్నాయన్నారు. వాటిని బయటపెట్టడానికి ఎవరూ ముందుకురారని, తాను ఇలాంటి చేదు సంఘటనలు ఎదుర్కొన్నట్టు చెప్పారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడే ఎందుకు మాట్లాడారని చాలామంది అడుగుతున్నారని, పరిస్థితుల రీత్యా కొన్నిసార్లు బయటకువచ్చి మాట్లాడలేమన్నారు. 
 
అంతకు కొన్ని రోజుల ముందు వరలక్ష్మి వ్రత్రం సందర్భంగా సనమ్ ఓ వివాదాస్పద వీడియోను షేర్ చేసింది. మహాలక్ష్మీ దేవి పూజను అందరూ జరుపుకుంటున్నామని.. కానీ మన మధ్య నడిచే దేవతలు అత్యాచారానికి, హత్యలకు గురవుతారు. ప్రాణాలను పోసే దేవదూత లాంటి జూనియర్ డాక్టర్ మౌమిత దేబ్‌నాథ్‌ను అనాగరికంగా హత్య చేస్తే.. కోల్‌కతాలో  రీక్లెయిమ్ ది నైట్ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. తాను దానిని చెన్నైలో క్లెయిమ్ ది నైట్‌గా ప్రారంభించాలనుకుంటున్నా. ఈ నిరసనలో నాతో కలిసి బాధితురాలికి న్యాయం చేయడంలో సాయం చేయాలని కోరుతున్నానని శెట్టి తెలిపారు.  
 
ఇదే వీడియో సనమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక ఆడపిల్ల అనుమతి లేకుండా అమెను తాకడానికి ఎవరికి అధికారం లేదన్నారు. తాను ఓ నటిని, ఎంటర్‌టైన్‌ చేయడమే నా వృత్తి అలాగని ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకోనంటూ  సనమ్ శెట్టి వివాదాస్పద వాఖ్యలు చేసింది. సనమ్ వాఖ్యలపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.‌ ఆమె‌ దృష్టిలో అవకాశాలు లభించిన హీరోయిన్స్ అందరూ శరీరాలను సమర్పించుకున్నారా అంటూ వ్యతిరేకత వ్యక్తమయింది. సనమ్ శెట్టి తెలుగు సినిమాల్లో కూడా నటించింది.మోడల్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఆమె  మిస్‌ సౌత్‌ ఇండియా టైటిల్‌ను గెలుపొందింది. తమిళ చిత్రం అంబులితో నటిగా కెరీర్‌ను ప్రారంభించి..  మలయాళం, తెలుగు చిత్రాల్లో నటించింది. శ్రీమంతుడు,  సింగం 123 వంటి తెలుగు సినిమాల్లో సనమ్ కనిపించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్పోర్ట్స్ బిజినెస్‌లోకి సమంత.. మహిళలు ఎదురుచూస్తున్నారు..