Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పడక సుఖం ఇవ్వలేదని పగబట్టారు... నటి రవీనా టాండన్ సంచల కామెంట్స్

Advertiesment
ravina tondon

వరుణ్

, సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (11:20 IST)
సినీ నటి రవీనా టాండన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్రసీమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ అంశంపై ఆమె స్పందించారు. తనకు కూడా ఈ తరహా అనుభవాలు ఎదురైనట్టు చెప్పారు. ఒకపుడు వాళ్లకు పడకసుఖం ఇవ్వలేదన్న అక్కసుతో తనపై పగబట్టారంటూ సంచలన వ్యాఖ్యాలు చేశారు. గత యేడాది వచ్చిన కేజీఎఫ్ చిత్రంలో నటించిన రవీనా టాండన్... తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై స్పందించారు. 
 
చిత్రపరిశ్రమలో బడా కుటుంబాల నుంచి వచ్చిన వారికే ఎక్కువ అవకాశాలు వస్తాయని ఆరోపించారు. పైగా, తమ మాట వినని నటీనటులను తొక్కి పారేస్తారని చెప్పుకొచ్చారు. ప్రధానంగా ప్రతిభ ఉన్న నటీనటులపై పొగరు అనే ముద్ర తొలుత వేస్తారని, ఆ తర్వాత ప్రవర్తన సరిగా లేదని, తమకు అనుకూలమైన పత్రికల్లో వార్తలు రాయించి క్యారెక్టర్ దెబ్బతీసి, ఆ తర్వాత సైడ్ లైన్ చేసేస్తారని ఆరోపించారు. 
 
అలాగే, తన కెరీర్‌ను కూడా నాశనం చేయడానికి చాలా మంది ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశారన్నారు. దీని వెనుక పెద్ద కారణమే ఉందని తెలుసుకున్నట్టు చెప్పారు. ముఖ్యంగా, కొందరు నిర్మాతలు, దర్శకులు, హీరోలకు పడక సుఖం ఇవ్వలేదని, లైంగిక కోరికలు తీర్చలేదని తనపై బురదచల్లారని ఆరోపించారు. కేవలం పడక సుఖం కోసమే హీరోయిన్ కెరీర్‌ను నాశనం చేసే ఓ బ్యాచ్ ఉందన్నారు. కాగా, బాలయ్య నటించిన బంగారు బుల్లోడు చిత్రంలో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన రవీనా..  ఆతర్వాత పలు చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. గత యేడాది కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినీ ఇండస్ట్రీలో 14 ఏళ్లు పూర్తి చేసుకున్న సమంత రూతు ప్రభు