Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎ.ఎమ్. రాజా జయంతి.. తెలుగులో తొలి కవ్వాలిని పాడిన ఘనుడు

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (12:34 IST)
AM Raja
తొలి దక్షిణాది చలనచిత్ర గాయకుడు ఎ.ఎమ్. రాజా. తెలుగు సినిమాలో తొలి కవ్వాలిని ఎ.ఎమ్. రాజా పాడారు. 1952లో పెంపుడు కొడుకు సినిమా ఎస్. రాజేశ్వరరావు సంగీతంలో ఆ కవ్వాలి నమోదయింది. ఎ.ఎమ్.రాజా మంచి‌ సంగీతదర్శకులు కూడా.‌ 
 
పాశ్చాత్య సంగీతం ప్రభావంతో ఆయన చాల మంచి పాటలు చేశారు.‌ శోకగీతాల్ని కూడా పాశ్చాత్య సంగీతం ధోరణిలో గొప్పగా చేశారు. తమిళంలో గొప్ప పాటల్ని చేశారు.
 
దక్షిణ భారతదేశంలో నక్షత్రస్థాయిని అందుకున్న తొలి చలనచిత్రనేపథ్య గాయకుడు ఘంటసాల. ఆ ఘంటసాల ప్రభావం ఎంతమాత్రమూ లేకుండా ఒక గాయకుడుగా రాజా చలామణిలోకి వచ్చారు. 
 
రాజా మధురగాత్రంలో జాలువారిన ఎన్నో గీతాలు ఈ నాటికీ వీనులవిందు చేస్తూనే ఉన్నాయి. రాజా పాడిన పాటలకు నవీనబాణీల గుబాళింపుతోనూ కొందరు పరవశించే ప్రయత్నం చేశారు.
 
రాజా వాణి, ఆయన బాణీ, ఆయన గళం అన్నీ జనాన్ని మధురలోకాల్లో విహరింపచేశాయి. తన జీవితభాగస్వామి గాయని జిక్కితో కలసి రాజా పాడిన పాటలు సైతం తెలుగునేలపై చిందులు వేయించాయి. ఆయన మన తెలుగువాడు కావడం మన అదృష్టంగా భావించి సంతోషిద్దాం.. 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments