Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు చిక్కిన "సింగం" సినిమా విలన్

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (08:16 IST)
సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో కొందరు పెడదారిపడుతుంటారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. వివిధ రకాలైన నేరాలకు పాల్పడుతుంటారు. అలాంటి వారిలో సింగం చిత్రం విలన్ కూడా చేరాడు. డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన బెంగుళూరులో జరిగింది. 
 
తమిళ హీరో సూర్య సూర్య నటించిన చిత్రం సింగం. ఈ చిత్రంలో మెల్విన్ (45) అనే నైజీరియన్ విలన్‌గా నటించాడు. విలన్‌ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. అయితే, ఈయన తాజాగా, బెంగళూరులోని హెచ్‌బీఆర్ లే అవుట్ బీడీఏ కాంప్లెక్స్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.
 
బెంగళూరు సెంట్రల్ క్రైమ్ పోలీసులు (సీసీబీ) బుధవారం మెల్విన్‌ను అరెస్ట్ చేసి, అతడి నుంచి 250 గ్రాముల హషిష్ తైలం, 15 గ్రాముల ఎండీఎంఏ గుళికలు, ఫోన్, రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ.8 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
 
కరోనా లాక్డౌన్ సమయంలో సినిమా అవకాశాలు లేకపోవడంతో మెల్విన్ డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ వ్యవహారంతో సినీ పరిశ్రమకు చెందిన వారికి ఎవరికైనా సంబంధం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
 
కాగా, వైద్యం కోసం భారత్ వచ్చిన మెల్విన్ ముంబైలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనలో శిక్షణ తీసుకున్నాడు. కన్నడ, తమిళ, హిందీ సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా నెగటివ్ పాత్రల్లోనే నటించాడు. సింగం చిత్రంతో మంచి గుర్తింపుపొందాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు.. ఆధిక్యంలో బీజేపీ.. ట్రెండ్స్ మారితే?

మహారాష్ట్రలో తదుపరి సీఎం ఎవరు.. అప్పుడే మొదలైన చర్చ?

జార్ఖండ్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments