Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రాజు, మంచు విష్ణు పత్తాలేరు... ఏడిపించేసిన శ్వేతాబసు

శ్వేతాబసు ప్రసాద్ ఏడిపించేసింది. తను తాజాగా నటించిన చంద్రనందిని సీరియల్ గురించి తన ఇన్‌స్టాగ్రాంలో ఓ పోస్ట్ పెట్టి అందరి హృదయాలను బరువెక్కించింది. శ్వేతా బసు ప్రసాద్ బాలీవుడ్‌లో బాలనటిగా జాతీయ అవార్డు అందుకొని 'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు తెరక

Webdunia
శనివారం, 4 నవంబరు 2017 (20:10 IST)
శ్వేతాబసు ప్రసాద్ ఏడిపించేసింది. తను తాజాగా నటించిన చంద్రనందిని సీరియల్ గురించి తన ఇన్‌స్టాగ్రాంలో ఓ పోస్ట్ పెట్టి అందరి హృదయాలను బరువెక్కించింది. శ్వేతా బసు ప్రసాద్ బాలీవుడ్‌లో బాలనటిగా జాతీయ అవార్డు అందుకొని 'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన భామ. ఆ తర్వాత వ్యభిచారం కేసులో పట్టుబడి తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైంది.
 
అయితే, 'కొత్త బంగారు లోకం' చిత్రంలో ఈ భామకు మంచి పేరు వచ్చినప్పటికీ.. సినీ అవకాశాలు మాత్రం రాలేదు. చివరగా తెలుగులో 'మిక్చర్ పొట్లం' అనే సినిమాలో కనిపించింది. సినిమా అవకాశాలు అంతగా రాకపోవడంతో సీరియల్స్‌ వైపు మళ్లింది. ఆమె హిందీలో ‘చంద్ర నందిని’ అనే సీరియల్‌లో నటించింది. అయితే ఆ సీరియల్ లాస్ట్ ఎపిసోడ్ గురువారమే ముగిసింది. దీంతో అమ్మడు కొంచెం బాధతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. 
 
ప్రతి ప్రయాణానికి ఒక ఎండ్ ఉంటుంది ఆ విధంగానే ‘చంద్ర నందిని’ అనే సీరియల్ కూడా ముగిసింది అంటూ.. చాలా బాధగా ఉందని, చెప్పడానికి కూడా మాటలు రావడం లేదని తెలిపింది. అంతేకాకుండా అవకాశం ఇచ్చిన నిర్మాతతో సహా నటీనటులతో పాటు ప్రొడక్షన్ టీమ్‌కి ధన్యవాదాలు అని పేర్కొంది. 
 
ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమంటే... శ్వేతాబసు ప్రసాద్ వ్యభిచారం కేసులో పట్టుబడ్డప్పుడు సినీ నిర్మాత దిల్ రాజు, నటుడు మంచు విష్ణు ఆమెకు తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తామన్నారు. కానీ ఇప్పటివరకూ ఆ దిశగా ఆమెను సంప్రదించిన జాడ లేదు. మొత్తమ్మీద ఆమెకు అప్పట్లో మాట ఇచ్చిన ఏక్తా కపూర్ మాత్రం అన్నమాట ప్రకారం శ్వేతా బసుకు ఛాన్స్ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశగతిని మార్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ బడ్జెట్!!

Annamalai : కొరడాతో ఆరు సార్లు కొట్టుకున్న అన్నామలై.. చెప్పులు వేసుకోను.. ఎందుకు? (video)

31 నుంచి పల్నాడులో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన

సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనను ఆమోదించిన సీడబ్ల్యూసీ

భారతమాత ముద్దుబిడ్డల్లో మన్మోహన్ సింగ్ ఒకరు : రాష్ట్రపతి ముర్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments