Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోన లాక్డౌన్ జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పింది : శృతిహాసన్

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (15:19 IST)
టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరు శృతిహాసన్. విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దులు కుమార్తెల్లో ఒకరు. టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్. ఐరెన్ లెగ్ ముద్ర నుంచి బయటపడి వరుస చిత్రాల్లో నటిస్తోంది. అయితే, ఈ అమ్మడు కెరీర్ పీక్ దశలో ఉన్నపుడు ఓ బ్రిటన్ కుర్రోడితో ప్రేమలోపడింది. తొలుత ప్రేమ, ఆ తర్వాత డేటింగ్, పిమ్మట పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. చివరకు వీరిద్దరి ప్రేమ పెటాకులైంది. దీన్ని నుంచి కోలుకునేందుకు ఆమె కొంత సమయం తీసుకుంది. ఆ తర్వాత తన సినీ కెరీర్‌పై దృష్టిసారించి, పలు చిత్రాల్లో నటించేందుకు సంతకాలు చేసింది. 
 
ఇంతలోనే కరోనా వైరస్ ప్రపంచాన్ని కమ్మేసింది. ఈ వైరస్ ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేసిందని చెప్పొచ్చు. మరికొందరికి నిరాశ మిగిల్చింది. ఇంకొదరికి తమ అసలైన జీవితం ఏమిటో అనుభవపూర్వకంగా కళ్ళకుకట్టినట్టు చూపించింది. అనుక్షణం బిజీగా గడిపే సినీ సెలబ్రిటీలు సైతం నెలల తరబడి ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయంలో అనేక విషయాలు నేర్చుకున్నట్టు శృతిహాసన్ చెప్పుకొస్తోంది. 
 
మనుషుల గురించి, మానవత్వం గురించి, మన బలాలు, బలహీనతల గురించి ఈ సంవత్సరం ఎంతో నేర్చుకున్నానని శ్రుతి తెలిపింది. తాను ఎంత ఒంటరి వ్యక్తినో, తనకు మనుషులు ఇచ్చే విలువ ఏంటో తెలుసుకున్నానని చెప్పింది. ముఖ్యంగా తనను తాను ఎలా ప్రేమించుకోవాలనే విషయాన్ని నేర్చుకున్నానని తెలిపింది. తాను ఎక్కడ ఉన్నానో తెలుసుకునేందుకు ఈ సమయం ఎంతో ఉపయోగపడిందని చెప్పింది. సినీ ప్రపంచం, కళ, అవి తనకిచ్చే ప్రేమ గురించి తెలుసుకున్నట్టు శృతిహాసన్ చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments