Webdunia - Bharat's app for daily news and videos

Install App

'తమ్ముడు' సినిమాతో దూరం.. 'అన్నయ్య' సినిమాతో రీఎంట్రీ

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (16:06 IST)
2017లో వచ్చిన 'కాటమరాయుడు' సినిమా తర్వాత మళ్లీ తెలుగుతెరకు దూరమైన శృతిహాసన్ ఇప్పుడు 'అన్నయ్య' సినిమాతో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయనే ఊహాగానాలు వినపడుతున్నాయి. మరి అన్నీ అనుకున్నట్లు జరిగినట్లయితే చిరంజీవి-కొరటాల సినిమాలో శృతిహాసన్‌ను హీరోయిన్‌గా తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. 
 
నిజానికి 'కాటమరాయుడు' ఫ్లాప్‌కి, శృతిహాసన్ గ్యాప్‌కి ఎటువంటి సంబంధం లేదు. ఆవిడ మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ చేయడంతోపాటు, ప్రియుడు మైఖేల్ కోర్సల్‌తోనూ, కుటుంబంతోనూ సమయం గడపాలనే ఉద్దేశ్యంతో ఆవిడ ఉద్దేశ్యపూర్వకంగా ఈ గ్యాప్ తీసుకోవడం జరిగింది.
 
ఆ విధంగా రెండేళ్లుగా వెండితెరకు దూరమైన శృతిహాసన్, తాజాగా మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఓ హిందీ సినిమాకు ఓకే చెప్పి తాజాగా తెలుగు, తమిళ భాషలపై కూడా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే చిరంజీవి సినిమా ఆఫర్ కూడా శృతిహాసన్ చెంతకు వచ్చినట్టు తెలుస్తోంది. 
 
గతంలో శృతిహాసన్‌తో 'శ్రీమంతుడు' సినిమా చేసిన దర్శకుడు కొరటాల శివ... చిరంజీవి సరసన కూడా ఆమె అయితే బాగుంటుందని భావించి సంప్రదించాడట. ప్రస్తుతానికైతే కథా చర్చలు ముగిసాయి కానీ శృతిహాసన్ ఇంకా తన నిర్ణయం చెప్పలేదని అంటున్నారు.
 
మరి ఆవిడగారి నిర్ణయమేమిటో ఇంకా వెల్లడి కావలసి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments