Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

మా అన్న బయోపిక్ అక్కర్లేదు : నాగబాబు

Advertiesment
Naga Babu
, మంగళవారం, 12 మార్చి 2019 (09:14 IST)
మెగాస్టార్ చిరంజీవి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ చిత్రంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. మెగాస్టార్‌పై బయోపిక్ తీయాల్సిన అవసరం లేదన్నారు. రాంచరణ్ కూడా తన తండ్రి బయోపిక్ తీయకపోవడమే ఉత్తమమంటూ సూచించారు. నా సోదరుడు కెరీర్ మొదట్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఆయన చాలా విజయవంతంగా సినీ కెరీర్‌ను కొనసాగించారు. 
 
నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల కాలం నడుస్తోంది. తెలుగులో ఇప్పటికే పలువురు సీనియర్ నటుల జీవితాల ఆధారంగా పలు చిత్రాలు వచ్చాయి. వీటిలో కొన్ని ఫెయిల్ అయితే మరికొన్ని సక్సెస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి బయోపిక్‌పై నటుడు నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ వార్తలపై నాగబాబు స్పందిస్తూ, సావిత్రి, సిల్క్ స్మిత, సంజయ్ దత్‌లాంటి స్టార్ల జీవితాలు వేరు. వారి జీవితాల్లో ఎన్నో విభిన్న పార్శ్వాలున్నాయి. అందుకే వారి బయోపిక్‌లు తీస్తే ప్రేక్షకులు ఎగబడి మరీ థియేటర్లకు వచ్చారు. ఓ వ్యక్తి జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు అనేవి బయోపిక్‌కు చాలా ప్రాధాన్యమైన అంశం. అలాంటి నేపథ్యంతో సినిమా తీస్తే బాగుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటి హేమకు ఆ పవర్ వుంది... పవన్ కల్యాణ్ టిక్కెట్ ఇస్తేనా?