Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐరన్ లెగ్ టు గోల్డెన్ లెగ్.. పవన్ కల్యాణ్-డాలీ సినిమాలో శ్రుతిహాసన్ అందుకే?!

డాలీ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న సినిమాకు శ్రుతిహాసన్ ఓకే చెప్పింది. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ముందు నో చెప్పిన శ్రుతిహాసన్ తిరిగి పవన్ సినిమాకు ఓకే చెప్పేసింది. ప్రస్తుతం డాల

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (14:43 IST)
డాలీ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న సినిమాకు శ్రుతిహాసన్ ఓకే చెప్పింది. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ముందు నో చెప్పిన శ్రుతిహాసన్ తిరిగి పవన్ సినిమాకు ఓకే చెప్పేసింది. ప్రస్తుతం డాలీ ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ సిద్ధం చేస్తున్న నేపథ్యంలో.. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. 
 
ముందుగా ఈ సినిమాకి శృతి హసన్‌ని తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో పార్వతి టి.కే, కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు వినిపించాయి. కానీ ఎలాగోలా శ్రుతిహాసన్ ఈ సినిమాకు హీరోయిన్‌గా ఖరారైందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్ చేస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడంలో జాప్యానికి అదే కారణమని.. శ్రుతిహాసన్ డేట్స్ అడ్జెస్ట్ చేయగానే ఇక సెట్స్‌పైకి సినిమాను తెరకెక్కించేందుకు అంతా సిద్ధమయ్యారని తెలిసింది. 
 
పవన్ కళ్యాణ్, శృతి హసన్ కాంబినేషన్లో రూపొందిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ అవడంతో మళ్ళీ పవన్‌తో రొమాన్స్ చేసేందుకు శ్రుతిహాసన్ రెడీ అయ్యింది. తొలుత ఐరన్ లెగ్‌గా పేరు కొట్టేసిన శ్రుతి.. గబ్బర్ సింగ్ తర్వాతే గోల్డెన్‌ లెగ్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే జనసేన అధ్యక్షుడు, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ లండన్‌కి వెళ్లారు. నెల రోజులుగా జరుగుతున్న జయతే కూచిపూడి ఫెస్టివల్ క్లోజింగ్ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments