గౌతమి నా జీవితంలోనే లేదు : శృతిహాసన్

విశ్వనటుడు కమల్ హాసన్, సినీ నటి గౌతమి 13 యేళ్ళ సహజీవనం తర్వాత గత యేడాది విడిపోయారు. వీరిద్దరు విడిపోవడానికి ప్రధాన కారణం కమల్ కుమార్తె, హీరోయిన్ శృతిహాసన్ అనే ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా, కోలీవుడ

Webdunia
ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (17:44 IST)
విశ్వనటుడు కమల్ హాసన్, సినీ నటి గౌతమి 13 యేళ్ళ సహజీవనం తర్వాత గత యేడాది విడిపోయారు. వీరిద్దరు విడిపోవడానికి ప్రధాన కారణం కమల్ కుమార్తె, హీరోయిన్ శృతిహాసన్ అనే ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా, కోలీవుడ్‌లో అయితే ఈ ప్రచారాన్ని చాలా నమ్మారు కూడా.
 
దీనిపై అటు కమల్ లేదా ఇటు శృతిహాసన్ ఎన్నడూ స్పందించిన దాఖలాలు లేవు. కానీ, ఇపుడు శృతిహాసన్ స్పందించారు. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ, 'అసలు గౌతమి నా జీవితంలోనే లేదు. అందుకే ఆ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదు' అంటూ ఒక్క ముక్కలో తేల్చిపారేసింది. 
 
అలాగే, తన పెళ్లిపై ఓ క్లారిటీ ఇచ్చింది. ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఆలోచనేదీ లేదని స్పష్టం చేసింది. తన విషయంలో రహస్యాలేవీ ఉండవని.. ఏవైనా సరే దాచుకోకుండా కక్కేస్తానని వెల్లడించింది. తన అభిప్రాయానికి కుటుంబం కూడా విలువనిస్తుందని, మైఖేల్ కోర్సలే తనకు స్నేహితుడు మాత్రమేనని అంతకంటే అతని గురించి ఎక్కువేమీ చెప్పలేనని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో బ్రూక్‌ఫీల్డ్ 1.04 గిగావాట్ హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ. 7,500 కోట్లు మంజూరు

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. కుక్కర్ల నుంచి లిక్కర్స్ వరకు.. పిల్లల్నీ వదిలిపెట్టలేదట

Aadudham Andhra: ఆడుదాం ఆంధ్రలో అవకతవకలు.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఏడు అడుగుల ఎత్తున్న మహిళ.. షాకైన భక్తులు (Video)

39 ఫామ్‌హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు.. డీజేలు, హుక్కా, మద్యం.. స్కూల్ స్టూడెంట్స్ ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments