Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజశేఖర్‌తో శ్రియ.. యాంగ్రీమెన్‌తో రొమాన్స్

Webdunia
బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (09:01 IST)
యాంగ్రీమేన్ రాజశేఖర్ నటించేందుకు ఎవర్ గ్రీన్ సుందరి శ్రియ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు దాటినా.. ఆమె హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. పెళ్లికి తర్వాత కూడా సినిమాలు చేస్తూ.. ఫిజిక్‌ను పక్కాగా మెయింటైన్ చేస్తున్న శ్రియ.. తాజాగా రాజశేఖర్ సరసన నటించే అవకాశాన్ని కైవసం చేసుకుంది. 
 
ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్టు చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో వుంటున్న శ్రియ.. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వేళ, ఆమెకు రాజశేఖర్ ద్వారా అవకాశం వరించింది. 
 
'గరుడవేగ' హిట్ తరువాత రాజశేఖర్ చేసిన 'కల్కి' కలెక్షన్ల పరంగా నిరుత్సాహపరచగా, కాస్తంత గ్యాప్ తీసుకున్న రాజశేఖర్, 'అహ నా పెళ్ళంట', 'పూలరంగడు' సినిమాలకు దర్శకత్వం వహించిన వీరభద్రం చౌదరికి తన తదుపరి సినిమాను అప్పగించారు.
 
ఈ సినిమాలో శ్రియ కథానాయికగా నటించనుంది. ఈ వెటరన్ బ్యూటీ, బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ నటించే చాన్స్ కొట్టేసిందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల ద్వారా మళ్లీ శ్రియ వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments