దర్శకులందరినీ ఆ మాట అనేసిన సమంత.. ఏమన్నారు..?

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (19:36 IST)
జాను సినిమా విమర్శకుల నోళ్ళు మూయించింది. ఆ క్యారెక్టర్ నేను చేయలేను.. అసలు జానులో సమంత క్యారెక్టర్ ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చదని షూటింగ్ సమయంలోనే కొంతమంది నాపై విమర్శలు చేశారు. సినిమా పూర్తయిన తరువాత.. నేను సినిమాను చూశాను. అద్భుతంగా వచ్చింది.

ఈ సినిమాను అందరూ ఆదరిస్తానని నమ్మాను. అదే జరిగింది. విమర్శకులు ఒక్కసారిగా నోళ్ళను మూసేశారు. ఇప్పుడు నేను ఎలాంటి క్యారెక్టర్ నైనా చేయగలనన్న నమ్మకం నాలోనే కలిగింది అంటోంది సమంత. తనపై కావాలనే పనిగట్టుకుని కొంతమంది విమర్శలు చేస్తున్నారని.. అది తనకు ఏ మాత్రం నచ్చలేదంటోంది సమంత. 
 
విమర్శలు ఉండాలి.. కానీ అది పరిధిని దాటకూడదు. ఆ పరిధిని దాటి కొంతమంది మాట్లాడుతున్నారు. అది కూడా దర్శకులే. నేను వారు వీరు అని పేర్లు చెప్పను. కానీ దర్శకులు నన్ను కలిసినప్పుడు ఒక స్టోరీ చెబుతారు. ఆ స్టోరీ నాకు నచ్చితే సినిమాను ఒప్పుకుంటాను.

కానీ సినిమా ప్రారంభమైన తరువాత స్క్రిప్ట్‌కు, చేసే సినిమాకు అస్సలు పొంతనే ఉండదు. ఇలా చాలామంది దర్శకులను నేను చూశాను. అందులో ఒకటి రంగస్థలం సినిమా అంటోంది సమంత. దర్సకులలో చాలామంది ఇలాగే ఉంటారంటోంది సమంత.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Caught on camera: గుండెపోటుతో ఏఎస్ఐ మృతి.. ఎస్కలేటర్‌పైకి అడుగుపెట్టేందుకు? (video)

అన్నమయ్య జిల్లాలో చెల్లెలిపై అన్న లైంగిక దాడి, మగబిడ్డకు జన్మనిచ్చిన బాలిక

ఏపీలో నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్

ఏడేళ్ల సోదరుడి ముందే గంజాయి మత్తులో బాలికపై అత్యాచారం

మహిళలకు నెలసరి సెలవు మంజూరు - కర్నాటక మంత్రివర్గం నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments