Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా పెంచిన నయనతార... నోరెళ్లబెడుతున్న నిర్మాతలు

మలయాళ బ్యూటీ నయనతార తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసింది. ఆ రేటును చూసి నిర్మాతలు నోరెళ్లబెడుతున్నారు. నిజానికి గత కొన్ని రోజులుగా నయనతార మార్కెట్ బాగా పెరిగితోంది. మొదట్లో అందాలొలకబోయడానికే పరిమితమైన

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (17:29 IST)
మలయాళ బ్యూటీ నయనతార తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసింది. ఆ రేటును చూసి నిర్మాతలు నోరెళ్లబెడుతున్నారు. నిజానికి గత కొన్ని రోజులుగా నయనతార మార్కెట్ బాగా పెరిగితోంది. మొదట్లో అందాలొలకబోయడానికే పరిమితమైన ఈ కేరళా భామ ఆ తరువాత అభినయానికి అవకాశం ఉన్న పాత్రల్లో సత్తా చాటుకుంటోంది. ఇంకా చెప్పాలంటే అరం చిత్రానికి ముందు, ఆ తరువాత అన్నంతగా నయనతార స్థాయి మారిపోయింది.
 
లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న ఈ సంచలన నటి స్థాయికి తగ్గట్టుగా పారితోషికాన్ని పెంచుకుంటూ పోతోందనే చెప్పాలి. అయినా చిత్ర అవకాశాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ప్రస్తుతం చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. వాటిలో సగం వరకూ లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలే కావడం విశేషం. అగ్రనటిగా రాణిస్తున్న నయనతార మరో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపిందన్నది తాజా సమాచారం.
 
దీంతో ఇదే అదునుగా భావించిన నయనతార.. తన రెమ్యునరేషన్‌ను ఒక్కసారి భారీగా పెంచేసిందట. తాజాగా జీవీ.ప్రకాశ్‌కుమార్‌ హీరోగా హర్రర్‌ చిత్రాన్ని తెరక్కెస్తున్నారు. దీని తర్వాత నయనతార ప్రధాన పాత్రలో ఒక చిత్రం చేయడానికి రెడీ అవుఉన్నారు. ఈ చిత్రంలో నయనతారకు పారితోషికం అక్షరాలా రూ.5.5 కోట్లనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇదే గనక నిజం అయితే దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నయనతార పేరు నమోదవుతుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments