Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ న్యూస్ : తమ్ముడి అంత్యక్రియలకు హాజరుకాని రవితేజ..

హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన సోదరుడు భరత్ అంత్యక్రియలకు టాలీవుడ్ హీరో రవితేజ హాజరుకాలేదు. శనివారం రాత్రి జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో భరత్ మృతి చెందిన విషయం త

Webdunia
ఆదివారం, 25 జూన్ 2017 (17:39 IST)
హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన సోదరుడు భరత్ అంత్యక్రియలకు టాలీవుడ్ హీరో రవితేజ హాజరుకాలేదు. శనివారం రాత్రి జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో భరత్ మృతి చెందిన విషయం తెల్సిందే. కారును 140 కిలోమీటర్ల వేగంతో నడిపి రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టడంతో భరత్ ప్రమాదస్థలిలోనే కన్నుమూశాడు. భరత్ అంత్యక్రియలు ఆదివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో జరిగాయి. 
 
ఈ కార్యక్రమాన్ని రవితేజ మరో సోదరుడు రఘు నిర్వహించారు. భరత్ అంత్యక్రియలకు ఆయన మిత్రులు, సహనటులు హాజరయ్యారు. అయితే, రవితేజ, మిగిలిన కుటుంబ సభ్యులెవ్వరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీనిపై మీడియాలో పలు రకాల కథనాలు వచ్చాయి. 
 
దీంతో రవితేజ స్పందిస్తూ, ఎందుకు హాజరు కాలేకపోయామనే విషయాన్ని మిత్రులు, మీడియా అర్థం చేసుకోవాలని కోరారు. ఛిద్రమైపోయిన భరత్ భౌతికకాయాన్ని చూసి భరించలేనంటూ కుమిలిపోయిన రవితేజ, తన తమ్ముడితో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments