Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్ బుక్‌లో జాయిన్ కానున్న కాజోల్.. హృతిక్ రోషన్ ఖాతా హ్యాక్..

బాలీవుడ్ బ్యూటీ కాజోల్ ఫ్యాన్స్ క్లబ్ పేరిట అప్ డేట్స్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై కాజోల్ ఫ్యాన్స్‌కు ఆ కష్టాలు తీరనున్నాయి. కాజోల్ త్వరలో అధికారికంగా ఫేస్‌బుక్‌లో జాయిన్ కానుంది. ప్రస్తుతం క

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (11:11 IST)
బాలీవుడ్ బ్యూటీ కాజోల్ ఫ్యాన్స్ క్లబ్ పేరిట అప్ డేట్స్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై కాజోల్ ఫ్యాన్స్‌కు ఆ కష్టాలు తీరనున్నాయి. కాజోల్ త్వరలో అధికారికంగా ఫేస్‌బుక్‌లో జాయిన్ కానుంది. ప్రస్తుతం కాజోల్, అజయ్‌దేవ్‌గన్ ‘శివాయ్’ మూవీ ప్రమోషన్స్‌తో యూఎస్‌లో బిజీబిజీగా ఉన్నారు. కాజోల్, అజయ్‌దేవ్‌గన్ తో కలిసి శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఫేస్‌బుక్ కార్యాలయాన్ని సందర్శించి అధికారికంగా ఫేస్‌బుక్ ఖాతాను ప్రారంభించనున్నారు.
 
ఇదిలా ఉంటే బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. గుర్తు తెలియని వ్యక్తి సోమవారం సాయంత్రం హృతిక్‌ ఫేస్‌బుక్‌ను హ్యాక్‌ చేశాడు. లైవ్‌ చాట్‌ ద్వారా అభిమానులతో కొంతసేపు సంభాషించాడు. చివరికి చాట్‌ చేస్తున్నది హృతిక్‌ కాదని ఫ్యాన్స్‌కు అర్థమైపోయింది. 
 
దాదాపు 500 మంది అభిమానులు ఈ లైవ్‌ చాట్‌లో పాల్గొన్నారు. అంతేకాదు ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌గా ఉన్న హృతిక్‌ ఫొటో తీసేసి హ్యాకర్‌ తన ఫొటో పెట్టుకున్నాడు. దీంతో కాసేపటి తర్వాత తన ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాకింగ్‌కు గురైందని హృతిక్‌ నిర్ధారించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments