Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కాంచన-3' నటి అలెగ్జాండ్రా జావి ఆత్మహత్య

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (16:11 IST)
రాఘవ లారెన్స్ నటించిన చిత్రం 'కాంచన-3'. ఇందులో రష్యాకు చెందిన అలెగ్జాండ్రా జావి నటించింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోవాలోని తన నివాసంలో ఆమె శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు, పోలీసులు వెల్లడించారు. 
 
గత కొన్నిరోజుల క్రితమే ప్రియుడి నుంచి అలెగ్జాండ్రా విడిపోయిందని.. దీంతో ఆమె మానసికంగా కుంగుబాటుకుగురై.. ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. దీంతో, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
రష్యాకు చెందిన అలెగ్జాండ్రా మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో ఆమె భారత్‌కు వచ్చారు. గత కొంతకాలం నుంచి గోవాలో నివాసముంటున్నారు. రాఘవ లారెన్స్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘కాంచన-3’లో అలెగ్జాండ్రా ఓ కీలకపాత్ర పోషించారు. 
 
ఇక, వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. తనని లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ చెన్నైకు చెందిన ఓ ఫొటోగ్రాఫర్‌పై ఆమె 2019లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అప్పట్లో ఆ ఫొటోగ్రాఫర్‌ని అరెస్ట్‌ చేశారు. అలెగ్జాండ్రా మృతి కేసు విచారణలో భాగంగా సదరు ఫొటోగ్రాఫర్‌ని సైతం పోలీసులు విచారించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం