Webdunia - Bharat's app for daily news and videos

Install App

జానీ మాస్టర్‌కు మరో షాక్- నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీ

సెల్వి
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (16:52 IST)
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. జానీ మాస్టర్‌ను పోలీస్ కస్టడీకి ఇస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అంగీకరించింది. 
 
థర్డ్‌ డిగ్రీ ప్రయోగించకూడదని, అవసరమైతే న్యాయవాది సమక్షంలో విచారించాలని కోర్టు సూచించింది. జానీ మాస్టర్‌ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ నెల 28న నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌ను విచారించనున్నారు. 
 
అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ అత్యాచారం ఆరోపణలపై జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments