Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాడు కోడికత్తి డ్రామాకు దళితుడు బలి... రాయి డ్రామాకు బీసీని బలి చేసేందుకు సిద్ధమయ్యారు... : పట్టాభి

Pattabhi

వరుణ్

, బుధవారం, 17 ఏప్రియల్ 2024 (16:50 IST)
గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామాకు దళితుడిని బలిపశువును వైకాపా నేతలు చేశారనీ, ఇపుడు గులకరాయి దాడిలో మరో బీసీని బలి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారన టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్రా సమయంలో ఓ యువకుడు గులకరాయితో దాడి చేశారు. ఈ కేసులో దాడి చేసిన నిందితుడితో పాటు మరో నలుగురుని అదుపులోకి తీసుకున్నారు. 
 
అయితే, ఈ కేసులో టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర రావును ఇరికించేందుకు వైకాపా నేతలు కుట్రలు పన్నుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కె.పట్టాభిరామ్ బుధవారం స్పందించారు. గత 2019 ఎన్నికల్లో కోడికత్తి డ్రామాకి ఒక దళితుడిని బలి చేశారని, ఇపుడు ఒక బీసీని బలి చేస్తున్నారని ఆగ్రహం  వ్యక్తం చేశారు. 
 
"బలహీన వర్గాలకు చెందిన పిల్లలను మీ కార్యాలయాల్లో బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? బీసీలంటే మీకు అంత చులకనగా ఉందా? రాష్ట్రంలో ఉన్న కోట్లాడి మంది బీసీలు ఇపుడు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. అలాంటి వారిపై ఈ రకమైన దౌర్జన్యం జరుగుతుంటే టీడీపీ చూసతూ ఊరుకుంటుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా దీని పర్యావసానాలు అనుభవిస్తారు" అంటూ ఆయన హెచ్చరించారు. 
 
హైదరాబాద్ నగరంలో చికెన్ - మటన్ షాపులు బంద్!! 
 
హైదరాబాద్ నగరంలో చికెన్, మటన్ షాపులు ఈ నెల 21వ తేదీన మూతపడనున్నాయి. మహావీర్ జయంతిని పురస్కరించుకుని ఈ షాపులను మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేశారు. కబేళాలు, మాంసం దుకాణాలన్నీ బంద్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జైన మతస్తుల ముఖ్యమైన పండుగల్లో మహావీర్ జయంతి ఒకటి తెలిపారు. అందువల్ల ఈ నెల 21వ తేదీన అన్ని రకాల మటన్, చికెన్ షాపులను మూసివేయాలని ఆదేశించారు. 
 
ఆదివారం చికెన్, మటన్ షాపుల ముందు రద్దీ మామూలుగా ఉండదు.. సాధారణంగా ఆదివారం పూట చాలా ఇళ్లల్లో మాంసం వంటకాల ఘుమఘుమలు కనిపిస్తాయి. సండే స్పెషల్ అంటే నాన్ వెజ్ మాత్రమే అనేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. అయితే, ఈ ఆదివారం మాత్రం హైదరాబాద్ వాసులు మాంసాహారం తినడం కుదరదు. ఎందుకంటే.. ఈ నెల 21న సిటీలోని అన్ని కబేళాలతో పాటు మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కబేళాలు, మాంసం దుకాణాలను ఆదివారం బంద్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Jai Sriram, అయోధ్యలో బాలరామునికి అద్భుత సూర్యతిలకం