Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాక్... రామ్‌ చరణ్, బోయ‌పాటి మూవీ యాక్ష‌న్ సీన్స్ లీక్..!

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (11:52 IST)
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల విదేశాల్లో షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ వైజాగ్ చేరుకుంది. ఈ సందర్భంగా రామ్‌చరణ్, బోయపాటి శ్రీను, నిర్మాత డీవీవీ దానయ్యలు సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకున్నారు. 
 
ఈ సందర్భంగా సింహాచలం ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని కప్ప స్తంభానికి ఆలింగనం చేసుకున్నారు. పుజానంతరం ఆలయ అధికారులు స్వామికి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. ఈ సినిమాలో చ‌ర‌ణ్‌ సరసన కైరా అద్వానీ నటిస్తోంది. అయితే... ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తున్నాయి. ఇందులో చరణ్ కత్తి పట్టుకుని ఫైట్ చేస్తున్నాడు. ఈ ఫోటోలు లీక‌వ్వ‌డంతో చిత్ర యూనిట్ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. 
 
తాజా షెడ్యూల్ కాకుండా మ‌రో షెడ్యూల్ కూడా ఉంద‌ట‌. సంక్రాంతికి రిలీజ్ కాబ‌ట్టి ఇంకా టైమ్ ఉంది కానీ... బోయ‌పాటి మాత్రం షూటింగ్ లేట్ అవుతుండ‌టంతో టెన్ష‌న్ ప‌డుతున్నార‌ని తెలిసింది. సంక్రాంతికి రానున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి మోహం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments