డాక్టర్ వరుణ్ గా శివ కార్తికేయన్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (17:00 IST)
Shiva Karthikeyan, Priyanka Arul Mohan
శివకార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం `డాక్టర్ వరుణ్‌' . ఈ చిత్రాన్ని విజయదశమి సందర్బంగా అక్టోబర్ 9న‌ న తెలుగునాట ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. కే. జె. ఆర్ స్టూడియోస్ కోటపాడి జే రాజేష్ ఈ చిత్రాన్ని  గంగ ఎంటర్టైన్మెంట్స్ , ఎస్ కె ప్రొడక్షన్స్ తో సంయుక్తంగా నిర్మించారు.
 
ఇదివరకే విడుదలైన తమిళ పాటలు, అనిరుధ్ సంగీతం చిత్రంపై విపరీతమైన అంచనాలు పెంచగా, తెలుగులో కూడా పాటల్ని త్వరలోనే విడుదల చేయనున్నారు. ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించగా , వినయ్ రాయ్ విలన్ గా చేశారు.
 
ఈ సందర్బంగా నిర్మాత  కోటపాడి జె రాజేష్ మాట్లాడుతూ, “మా  చిత్రం మంచి మాస్ ఎంటర్టైనర్. ప్రస్తుతం విజయ్ హీరోగా  ‘బీస్ట్ ‘ చిత్రాన్ని చేస్తున్న నెల్సన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. శివకార్తికేయన్ తో ఇదివరకు మేము తీసిన 'శక్తి' అనే చిత్రం మంచి హిట్ అయ్యి మాకు లాభాల పంట పండించింది. ఈ చిత్రం కూడా అలాగే సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తూ అక్టోబర్ 9న  ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. ప్రేక్షకుల అంచనాలని మించి ఈ చిత్రం ఉంటుందని మాత్రం కచ్చితంగా చెప్పగలం" అన్నారు
 
డైరెక్టర్ నెల్సన్ మాట్లాడుతూ- "శివకార్తికేయన్ - అనిరుధ్ కాంబినేషన్ తో మంచి మాస్ ఎంటర్టైనర్ కథతో తెరకెక్కిన చిత్రం ఇది. డాక్టర్ వరుణ్ గా శివ కార్తికేయన్ నవరసాలు  చూపించారు. ఎన్నో ఒడిదుడుకుల తరువాత చిత్రం థియేటర్స్ లో అక్టోబర్ 9th న  విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులని నూటికి నూరు శాతం అలరిస్తుంది.ప్రస్తుతం విజయ్ తో ‘బీస్ట్’ చిత్రం చేస్తున్నా"  అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

భాగ్యనగరిలో వీధి కుక్కల బీభత్సం - ఎనిమిదేళ్ళ బాలుడిపై దాడి

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments