Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ‌శౌర్య‌, అనీష్ కృష్ణ‌, ఐరా క్రియేష‌న్స్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన షర్లీ సేతియా

Webdunia
గురువారం, 26 నవంబరు 2020 (16:31 IST)
హ్యాండ్స‌మ్ యాక్ట‌ర్ నాగ‌శౌర్య‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణ కాంబినేష‌న్‌లో ఐరా క్రియేష‌న్స్ ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఇటీవ‌ల లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ డిసెంబ‌ర్ నుంచి జ‌ర‌గ‌నుంది.
 
ఆక్లాండ్‌కు చెంది, ఫోర్బ్స్ మ్యాగ‌జైన్‌లో స్థానం పొందిన సంచ‌ల‌న గాయ‌ని, న‌టి షిర్లీ సేతియా ఈ మూవీలో నాగ‌శౌర్య జోడీగా ఎంపిక‌య్యారు. నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ 'మ‌స్కా'తో న‌టిగా మారిన షిర్లీ, త్వ‌ర‌లో 'నిక‌మ్మా' చిత్రంతో బాలీవుడ్‌లోనూ ప‌రిచ‌యం అవుతున్నారు.
 
ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని ఉష ముల్పూరి నిర్మిస్తున్నారు. ద‌ర్శ‌కునిగా అనీష్ కృష్ణ‌కు ఇది మూడో సినిమా. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, సాయి శ్రీ‌రామ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.
 
హీరో హీరోయిన్లు: నాగ‌శౌర్య‌, షర్లీ సేతియా
సాంకేతిక బృందం:
ద‌ర్శ‌కుడు: అనీష్ కృష్ణ‌
నిర్మాత‌: ఉషా ముల్పూరి
స‌మ‌ర్ప‌ణ‌: శ‌ంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి
బ్యాన‌ర్‌: ఐరా క్రియేష‌న్స్‌
స‌హ నిర్మాత‌: బుజ్జి
సంగీతం: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: సాయి శ్రీ‌రామ్‌
డిజిట‌ల్ హెడ్‌: ఎం.ఎన్‌.ఎస్‌. గౌత‌మ్‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరి 1, 2025 నుండి ఇండోర్ యాచిస్తే ఎఫ్ఐఆర్ నమోదు..

డిసెంబరు 17 నుండి 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పర్యటన

కెనడా రాజకీయాల్లో సంచలనం - ఉప ప్రధాని క్రిస్టియా రాజీనామా

పురిటి నొప్పులు వచ్చినా గ్రూప్-2 పరీక్షలు రాసింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

అత్తగారి ఊరిలో 12 ఇళ్లకు కన్నం వేసిన భలే అల్లుడు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments