Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిట్‌కాయిన్ స్కాంలో బాలీవుడ్ హీరోయిన్ భర్త...

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా ఇపుడు బిట్ కాయిన్ స్కామ్‌లో చిక్కుకున్నారు. ఈయనపై ఏకంగా రూ.2 వేల కోట్ల బిట్‌కాయిన్ స్కామ్‌లో చిక్కుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన వ

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (14:28 IST)
బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా ఇపుడు బిట్ కాయిన్ స్కామ్‌లో చిక్కుకున్నారు. ఈయనపై ఏకంగా రూ.2 వేల కోట్ల బిట్‌కాయిన్ స్కామ్‌లో చిక్కుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన వద్ద విచారణ జరిపేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ణయించింది.
 
రూ.2 వేల కోట్ల బిట్‌కాయిన్ మైనింగ్ స్కాంలో ప్రధాన నిందితుడైన అమిత్ భరద్వాజ్‌తో పాటు కుంద్రా పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో రాజ్‌కుంద్రాకు ఉన్న సంబంధాలపై విచారణ జరుపుతున్నారు. ఈ స్కామ్‌లో భరద్వాజ్‌ను ఏప్రిల్ 5వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. 
 
భారీ మోసంలో కుంద్రా పాత్ర ఉన్న నేపథ్యంలో అతన్ని విచారిస్తున్నారా? లేక భరద్వాజ్ చేతిలో మోసపోయిన వారిలో కుంద్రా కూడా ఒక పెట్టబడిదారా? అనే విషయం తెలియాల్సి ఉంది. గతంలో వెలుగు చూసిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో రాజ్‌కుంద్రా నిందితుడిగా తేలిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments