Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి సినిమాల్లో ఎంతమందిని తొక్కారో... నా నోటికి పని చెప్పొద్దు.. శ్రీరెడ్డి ట్వీట్

ఏపీ ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు నటి శ్రీరెడ్డి మద్దతుగా నిలిచారు. నారా లోకేశ్‌పై విమర్శలు గుప్పించేవారికి ఆమె పరోక్ష వార్నింగ్ ఇచ్చారు. తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న కాస్టిం

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (13:39 IST)
ఏపీ ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు నటి శ్రీరెడ్డి మద్దతుగా నిలిచారు. నారా లోకేశ్‌పై విమర్శలు గుప్పించేవారికి ఆమె పరోక్ష వార్నింగ్ ఇచ్చారు. తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై తన పోరాటం కొనసాగుతుందని ప్రకటించిన శ్రీరెడ్డి.. ఇపుడు లోకేశ్‌కు అండగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్‌లను లక్ష్యంగా చేసుకుని ట్వీట్లలో విమర్శలు గుప్పించారు.
 
'నారా లోకేశ్‌‌గారిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవాళ్లు ఎవరూ లేరు. కొత్త పార్టీ ఏం చేస్తుందో అది చెప్పుకోండి. అంతేగానీ లోకేశ్‌ను విమర్శిస్తే ఒప్పుకునేది లేదు. నా నోటికి పని చెప్పొద్దు..' అని ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. అలాగే, చిరంజీవి సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఎంత మందిని తొక్కారో ఎవరికి తెలుసంటూ శ్రీరెడ్డి పేర్కొంది. మరోపోస్టులో టీడీపీ అధినేత చంద్రబాబు పాలన, అభివృద్ధిని ప్రశంసిస్తూ, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసింది. ఇందులో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేరును ప్రస్తావించకుండా విమర్శలు చేసింది. 
 
"మీ అన్న తిరుపతి నుంచి ఎన్నికైన తర్వాత 5 యేళ్లలో ఒకే ఒక్కసారి తిరుపతికి వచ్చారనీ, వాళ్లకోసం సింగిల్ పైసా ఖర్చు పెట్టలేదనీ, ఎక్కడ కూడా తిరుపతి అభివృద్ధి గురించి మాట్లాడలేదనీ తిరుపతి ప్రజల ఉవాచ. చంద్రబాబుగారు తిరుపతిలో తీసుకొచ్చిన ప్రాజెక్టులు, చేసిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసు. పాలనపై అవగాహన లేనివారిని ఎన్నుకుని తప్పుపని చేయొద్దని నా మనవి" అంటూ రెండో ట్వీట్‌లో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments