Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్ కుంద్రా చెప్పకుండానే ఇంటికొచ్చాడు.. బలవంతంగా కిస్ చేశాడు.. ఎవరు?

Webdunia
గురువారం, 29 జులై 2021 (21:37 IST)
పోర్న్ చిత్రాల కేసులో అరెస్టయిన శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై బాలీవుడ్‌ నటి షెర్లిన్‌ చోప్రా తీవ్ర ఆరోపణలు చేసింది. బిజినెస్‌ డీల్‌ కోసం ఇంటికొచ్చిన రాజ్‌కుంద్రా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది.

ఇదే కేసులో షెర్లిన్‌ చోప్రాకు ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు సోమవారం సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాజ్‌కుంద్రాపై షెర్లిన్‌ తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భార్య శిల్పాశెట్టితో సంబంధం సంక్లిష్టంగా మారిందని చెబుతూ బలవంతంగా తనకు ముద్దు పెట్టాడని ఆరోపించింది.  
 
2019లో ఓ ప్రపోజల్‌ గురించి రాజ్‌ కుంద్రా తన బిజినెస్‌ మెనేజర్‌కు కాల్‌ చేసినట్లు పేర్కొంది. 2019 మార్చి 27న బిజినెస్‌ మీటింగ్‌ తరువాత రాజ్‌ కుంద్రా ఓ రోజు తనకు చెప్పకుండానే ఇంటికి వచ్చినట్లు తెలిపింది. మెసెజ్‌కు సంబంధించిన వాదనలో సరాసరీ ఇంటికే వచ్చినట్లు తెలిపింది. 
 
అయితే ఇంటికి వచ్చిన రాజ్‌ కుంద్రా తన మాట వినకుండా బలవంతంగా కిస్‌ చేశాడని ఆరోపించింది. కానీ ఒక పెళ్లైన వ్యక్తితో తను రిలేషన్‌షిప్‌ పెట్టుకోవాలని లేదని.. తన ఆనందాలను బిజినెస్‌తో ముడి పెట్టాలని అనుకోలేదని పేర్కొంది.
 
అయితే తన భార్య శిల్పాశెట్టితో సంబంధం సంక్లిష్టంగా ఉందని... ఇంటి వద్ద ఎంతో ఒత్తిడి గురవుతున్నానని రాజ్ కుంద్రా తనతో అన్నాడని చెప్పింది. ఆ సమయంలో తనకు ఎంతో భయం వేయడంతో అతనిని తోసేసి వాష్ రూమ్‌కు పారిపోయానని తెలిపింది. 
 
ఇదిలా ఉండగా రాజ్ కుంద్రాపై షెర్లిన్ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కుంద్రా అరెస్ట్ అయిన తరువాత అశ్లీల చిత్రాల కేసుపై షెర్లిన్ చోప్రా ఓ వీడియో స్టేట్‌మెంట్‌ను విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Talakona: తలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మెరుగైన సౌకర్యాలు

KPHB : వేశ్యతో గొడవ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కత్తితో దాడి

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం