Webdunia - Bharat's app for daily news and videos

Install App

శర్వానంద్ - కృతిశెట్టి జంటగా నటించే కొత్త చిత్రం పేరు "మనమే"

ఠాగూర్
బుధవారం, 6 మార్చి 2024 (16:46 IST)
ప్రామిసింగ్ హీరో శర్వానంద్ తన 35వ చిత్రం ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ పూర్తిగా కొత్త లుక్‌లో ఆలరించనున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా, కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు టైటిల్, ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఏడిద రాజా ఈ చిత్రానికి అసోసియేట్ నిర్మాత.
 
ఈ చిత్రానికి 'మనమే' అనే ఆహ్లాదకరమైన టైటిల్ లాక్ చేశారు, టైటిల్ లో పూర్తి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. పోస్టర్‌లో శర్వానంద్, చిన్నారి- విక్రమ్ ఆదిత్య, ఎత్తైన భవనం పైకప్పుపై చేతిలో పెయింట్ రోలర్‌లతో నిలబడి ఉన్నారు. బాబు  వరల్డ్  గమనిస్తుండగా, శర్వా అతని వైపు చూస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో లండన్ బ్రిడ్జ్, థేమ్స్ నదిని కూడా చూడవచ్చు. శర్వా స్వెట్‌షర్ట్, ట్రాక్ ప్యాంట్‌లో చాలా ఎలిగెంట్ గా కనిపిస్తున్నాడు.
 
మేకర్స్ శర్వా వరల్డ్ ఆఫ్ మనమేని కూడా పరిచయం చేసారు, ఇది కథ లండన్ నేపథ్యంలో సెట్ చేయబడిందని సూచిస్తుంది. చివరి పోర్షన్స్‌లో శర్వా గాయపడిన కాలుతో ''I think it's time for some champagne.’ అంటే..  అక్కడ ఉన్న కృతి శెట్టి  అతని వైపు తీక్షణంగా చూస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శర్వాకు పిల్లవాడిపై ఉన్న ప్రేమను చూపుతుండగా, గ్లింప్స్ అతనిఫన్ లవింగ్ నేచర్ ని చూపిస్తుంది. న్యూ  అవతార్‌లో శర్వాను ప్రజెంట్ చేసిన పోస్టర్, గ్లింప్స్ పూర్తి యంగ్ వైబ్‌ని కలిగి ఉన్నాయి, న్యూ-ఏజ్ రొమ్-కామ్‌కి హామీ ఇచ్చాయి. విజువల్స్  బ్రైట్ గా వున్నాయి. హేషమ్ అబ్దుల్ వహాబ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వుంది.
 
న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ గా అందమైన ప్రేమకథతో వస్తున్న ఈ సినిమాకి  విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ VS సినిమాటోగ్రఫీని అందించారు. ప్రముఖ టెక్నీషియన్ ప్రవీణ్ పూడి ఎడిటర్, జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రానికి డైలాగ్స్‌ని అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ అందిస్తున్నారు.
 
తారాగణం: శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య
 
సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కృతి ప్రసాద్, ఫణి వర్మ
అసోసియేట్ ప్రొడ్యూసర్: ఏడిద రాజా
డైలాగ్స్: అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
డీవోపీ : విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

ఇద్దరి పిల్లల్ని కట్టేసి మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్, క్లీనర్

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments