Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తండ్రి కాబోతున్న శర్వానంద్.. భార్య కోసం అమెరికాకు..

Advertiesment
Sharvanand
టాలీవుడ్ హీరో శర్వానంద్ తండ్రి కాబోతున్నారని టాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ హైకోర్టు న్యాయవాది కుమార్తె అయిన రక్షితారెడ్డిని శర్వానంద్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ఎంగేజ్‌మెంట్ జరగగా, జూన్‌లో వివాహ వేడుక జరిగింది. 
 
మరోవైపు రక్షిత ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. అక్కడే రెగ్యులర్‌గా చెకప్‌లు కూడా చేయించుకుంటున్నారు. భార్యకు తోడుగా ఉండేందుకు శర్వానంద్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి  అమెరికాకు వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
డెలివరీ తర్వాతే మళ్లీ హైదరాబాద్‌కు రానున్నట్టు సమాచారం. అయితే ఈ వార్తలపై ఇంత వరకు శర్వానంద్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా స్పందించలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్మిక వీడియో.. ఆలోచిస్తేనే భయం కలుగుతోంది.. నాగ చైతన్య