సీనియర్ నటుడు ఈశ్వరీ రావు కన్నుమూశారు. అమెరికాలోని మిచిగాన్‌లో గత నెల 31వ తేదీన తుదిశ్వాస విడిచారు. అయితే, ఈ విషయం ఆలస్యంగా వచ్చింది. ఈశ్వర్ రావు కుమార్తె అమెరికాలోని మిచిగాన్‌లో ఉంటున్నారు. కూతురు వద్దకు వెళ్లిన ఈశ్వర్ రావు అక్కడే కన్నుమూశారు. ఆయన మరణావార్తతో తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. సోషల్ మీడియాలో వేదికగా సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
ఆయన దాసరి నారాయణరావు "స్వర్గం నరకం" చిత్రం ద్వారా ఈశ్వరరావు, మోహన్ బాబు చిత్ర సీమకు పరిచయం అయ్యారు. తొలి సినిమా "స్వర్గం నరకం"తో హిట్ పాటు, కాంస్య నంది అవార్డును అందుకున్నారు. కొద్ది రోజుల క్రితం మిచిగాన్‌లోని కుమార్తె ఇంటికి వెళ్లిన ఈశ్వర రావు అక్కడే తుదిశ్వాస విడిచారు.
దాదాపు 200కు పైగా సినిమాలలో, పలు సీరియల్స్‌లో కూడా ఈశ్వరరావు నటించారు. ప్రేమాభిషేకం, యుగపురుషుడు, దయామయుడు, ఘరనా మొగుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, జయం మనదే, శభాష్ గోపి తదితర విజయవంతమైన సినిమాల్లో ఈశ్వరరావు నటించారు.
తన తొలి సినిమాతోనే ఆయన నంది (కాంస్య) అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తన కెరీర్‌లో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. పలు టీవీ సీరియళ్ళలో కూడా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.