Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిచా చద్దా 'షకీలా'లో కనిపించనున్న షకీలా

Webdunia
గురువారం, 1 నవంబరు 2018 (11:06 IST)
సౌత్ శృంగార తార షకీలా. ఈమె జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రను బాలీవుడ్ నటి రిచా చద్దా పోషిస్తోంది. అయితే, తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే ఈ చిత్రంలో షకీలా కూడా ఓ చిన్న పాత్రలో కనిపించనుందట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. 
 
ఈ చిత్రం గురించి దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేశ్‌ మాట్లాడుతూ 'షకీలాగారి గురించి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆమె వ్యక్తిగత జీవితం, సినిమా జీవితం నన్ను విపరీతంగా ఆకట్టుకొన్నాయి. ఆమె ఎదుర్కొన్న కష్టాలను, దాటి వచ్చిన కష్ట సమయాలను, అవకాశాలు లేని రోజుల్లో ఆమె చేసిన ప్రయత్నాలను, ఆమె వ్యక్తిగతానికి సంబంధించిన పలు అంశాలను నేను తెరపై చూపించాలనుకున్నాను.
 
తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఆమె కూలంకుషంగా మాకు చెప్పారు. మా కథానాయిక రిచా కూడా ఆమెతో చాలా సమయాన్ని గడిపారు. షకీలాగారిలాగా మాట్లాడటం నేర్చుకున్నారు. ఆమె వ్యావహారిక శైలిని అలవరచుకున్నారు. ఇటీవల షకీలాగారు మా సెట్లోకి వచ్చినప్పుడు కూడా మా ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ను పిలిచి అమూల్యమైన సలహాలు ఇచ్చారు. ఆమె నివాసం ఎలా ఉండేదో సంపూర్ణంగా వివరించారు' అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments