Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను నగ్నంగా నటించినట్టు అలా చూపెట్టారు.. షకీలా

సినీ నటి షకీలా జీవిత చరిత్ర బయోపిక్ తెరకెక్కుతోంది. డైరక్టర్ లంకేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో షకీలా పాత్రను బాలీవుడ్ నటి రిచా చద్దా పోషిస్తోంది. ఈ నేపథ్యంలో, షకీలాను రిచా కలుసుక

Webdunia
ఆదివారం, 22 జులై 2018 (12:49 IST)
సినీ నటి షకీలా జీవిత చరిత్ర బయోపిక్ తెరకెక్కుతోంది. డైరక్టర్ లంకేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో షకీలా పాత్రను బాలీవుడ్ నటి రిచా చద్దా పోషిస్తోంది. ఈ నేపథ్యంలో, షకీలాను రిచా కలుసుకుంది. ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ, రిచా కూడా తనలాగే ధైర్యంగా ఉంటుందని తెలిపింది. 
 
రిచా స్క్రిప్ట్‌ను పూర్తిగా అర్థం చేసుకోగల నటి అని షకీలా కితాబిచ్చింది. ఈ సినిమాకు సంబంధించి తాను ఏదీ దాచలేదని... తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని చెప్పానని... నిజాలు దాచి, సినిమా తీస్తే బయోపిక్‌కు అర్థం లేదని చెప్పింది. 
 
సినిమాల్లో హీరోలకు, హీరోయిన్లకు డూప్‌లను ఉపయోగిస్తారని తెలుసు. కానీ నగ్నంగా నటించేందుకు ఒప్పుకోని హీరోయిన్లకు డూప్‌లను ఉపయోగించి న్యూడ్‌గా చూపుతారని తనకు తెలియదు. తన విషయంలో అదే జరిగింది. తాను లేకుండానే ఓ సీన్‌లో మరో మహిళను డూప్‌గా ఉపయోగించి తాను నగ్నంగా నటించినట్టు చూపించారని షకీలా తెలిపింది.  
 
అర్ధనగ్న సన్నివేశాలను వ్యతిరేకించడం వల్ల మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నానని, ఆ సమయంలో కొంత మంది బ్లూ ఫిలింస్‌లో నటిస్తారా అని సంప్రదించారు. అలాంటి గడ్డుపరిస్థితిలో దర్శకుడు తేజ పిలిచి జయం సినిమాలో అవకాశం ఇచ్చారు. దాంతో తన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. కన్నడలో చాలా అవకాశాలు వచ్చాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు పెరిగాయని షకీలా చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments