Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ నటి షకీలా చనిపోయిందా.. క్లారిటీ ఇచ్చిన నటి

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (22:51 IST)
సీనియర్ నటి షకీలా కన్నుమూసినట్లు పుకార్లు వచ్చాయి. అయితే అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే. ఈ రోజు ఉదయం షకీలా తన మరణం గురించి వచ్చిన వార్తలను కొట్టి పారేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. అంతేకాకుండా ఈ పుకారును సృష్టించిన వ్యక్తికి కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపింది. "నేను ఇక లేనని వార్తలు వచ్చినట్టు నాకు తెలిసింది. నిజానికి అలాంటిదేమీ లేదు నా ముఖంలో పెద్ద చిరునవ్వుతో నేను నిజంగా చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాను.
 
నా కోసం శ్రద్ధ తీసుకున్న వ్యక్తులకు ధన్యవాదాలు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరో నా గురించి చెడు వార్తలను వైరల్ చేశారు. దీంతో నాకు చాలా మెసేజెస్, కాల్స్ వచ్చాయి. ఫేక్ న్యూస్ ను వ్యాప్తి చేసిన వారికి ధన్యవాదాలు ఎందుకంటే ప్రేక్షకులు, ప్రజలు అందరు నా గురించి ఆలోచించేలా చేసినందుకు..." అంటూ చెప్పుకొచ్చారు షకీలా.
 
తెలుగు, తమిళ చిత్రాలలో సాఫ్ట్ పోర్న్ సినిమాల్లో నటించి అప్పట్లో సంచలనం సృష్టించిన షకీలా. ఆమె సినిమాలు అనేక భారతీయ భాషలలో డబ్ చేయబడ్డాయి. తర్వాత ఆమె సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ వచ్చింది. ప్రస్తుతం సినిమాల నుండి విరామం తీసుకుంది. లింగమార్పిడి కుమార్తె మిలాను దత్తత తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

ఆపరేషన్ మహాదేవ్- ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం