Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లోకి షకీలా .. మానవ హక్కుల విభాగంలో విధులు...

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (19:28 IST)
తన అంద చందాలతో సినీ అభిమానులను ఓ ఊపు ఊపిన సినీ నటి షకీలా... రాజకీయ ప్రవేశం చేశారు. బుధవారం ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ మేరకు ఆ పార్టీ తమిళనాడుకు చెందిన మానవ హక్కుల విభాగం బాధ్యతల్లో ఆమె పనిచేయనున్నారు. 
 
దక్షిణాది సినీ ప్రపంచంలో అతి తక్కువ కాలంలోనే వందలాది చిత్రాల్లో నటించిన షకీలా.. శృంగార తారగా ప్రేక్షకుల్లో ఆదరణ పొందారు. మలయాళం, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. 1995లో 18 ఏళ్ల వయస్సులోనే ‘ప్లేగర్ల్స్‌’ చిత్రంలో నటించారు. గతేడాది ఆమె జీవితకథ ఆధారంగా బయోపిక్‌ కూడా విడుదలైంది. ఆమె పాత్రలో బాలీవుడ్‌ నటి రిచా చద్దా నటించారు.
 
ఒకప్పుడు మలయాళంలో అగ్ర కథానాయకులకు పోటీగా ఆమె సినిమాలు విడుదలయ్యేవి. దక్షిణాదిలో మరే సినీ తారకు రానంత క్రేజ్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా తెలుగులోనూ వరుస అవకాశాలు దక్కించుకున్న షకీలా కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆమె జీవిత చరిత్రతో ఓ చిత్రం కూడా తెరకెక్కిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments