Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి టైటిల్‌తో వ‌స్తోన్న‌ క‌మెడియ‌న్ మూవీ..!

జ‌బ‌ర్ధ‌స్త్ ద్వారా బాగా ఫేమ‌స్ అయిన ఆర్టిస్టుల‌లో ష‌క‌ల‌క శంక‌ర్ ఒక‌రు. క‌మెడియ‌న్‌గా ఎన్నో పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకున్న ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు.

Webdunia
శనివారం, 29 సెప్టెంబరు 2018 (20:28 IST)
జ‌బ‌ర్ధ‌స్త్ ద్వారా బాగా ఫేమ‌స్ అయిన ఆర్టిస్టుల‌లో ష‌క‌ల‌క శంక‌ర్ ఒక‌రు. క‌మెడియ‌న్‌గా ఎన్నో పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకున్న ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం భవాని ఫిలింస్‌ పతాకంపై జి.వరలక్ష్మి సమర్పణలో షకలక శంకర్‌ హీరోగా హనుమాన్‌ కృష్ణ దర్శకత్వంలో శ్రీనివాసరావు గొలుసు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మ‌ర‌చిపోలేని సినిమా ఖైదీని టైటిల్‌గా ఖ‌రారు చేసారు.
 
ఈ చిత్రం విజయదశమి కానుకగా షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభించుకోనుంది. ఇప్పటికే పాటల రికార్డింగ్‌ పూర్తిచేసుకుందీ చిత్రం. కామెడీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం గురించి నిర్మాత శ్రీనివాసరావు గొలుసు మాట్లాడుతూ… చిరంజీవి గారి కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రం ‘ఖైదీ’. అలాంటి గొప్ప సినిమా టైటిల్‌‌తో ఆ సినిమాకు ఏమాత్రం చెడ్డ పేరు లేకుండా షకలక శంకర్‌ హీరోగా ‘ఖైదీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. 
 
కామెడీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా మా దర్శకుడు ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందిస్తున్నారు. దసరా సందర్భంగా సినిమా షూటింగ్‌ గ్రాండ్‌గా ప్రారంభించనున్నాం అన్నారు. మ‌రి.. ఖైదీ ష‌క‌ల‌క శంక‌ర్‌కి ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments