రెడ్డి ఇక్కడ చూడు లిరికల్ వీడియో రిలీజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''అరవింద సమేత వీర రాఘవ''. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీ

Webdunia
శనివారం, 29 సెప్టెంబరు 2018 (17:53 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''అరవింద సమేత వీర రాఘవ''. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇటీవలే చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్రయూనిట్.. రోజుకో సర్‌ప్రైజ్ ఇస్తూ ఎన్టీఆర్ అభిమానులను ఖుషీ చేస్తోంది. 
 
ఈ సినిమాలో కన్నడ భామ మేఘశ్రీ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించిందనేది తాజా సమాచారం. పలు కన్నడ చిత్రాలతో పాటు ఓమై గాడ్.. అనగనగా ఒక చిత్రం వంటి తెలుగు సినిమాల్లో ఆమె నటించింది. కాగా దసరా కానుకగా భారీ అంచనాల నడుమ అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించాడు.
 
ఈ సినిమాలోని ఏడ పోయినాడో.., అనగనగనగా, పెనివిటి, రెడ్డి ఇక్కడ సూడు అనే పాటలు శ్రోతల మనస్సును దోచేశాయి. తాజాగా రెడ్డి ఇక్కడ చూడు పాట లిరికల్ వీడియో యూట్యూబ్‌లో విడుదలైంది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ లిరికల్ వీడియోలో పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. అంజనా సౌమ్య, డాలెర్ ఈ పాటను పాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిత్తూరు మేయర్ దంపతులు హత్య కేసు : ఐదుగురుకి ఉరిశిక్ష

Chiranjeevi: డీప్ ఫేక్‌పై ప్రభుత్వాలు అసెంబ్లీ చట్టాలు తీసుకురావాలి: చిరంజీవి డిమాండ్ (video)

ఏం చెట్టురా అది, ఆ చెట్టు పడిపోకూడదు, బ్రతకాలి (video)

మద్యం తాగి ఇంట్లో పడొచ్చుకదా.. ఇలా రోడ్లపైకి ఎందుకు.. బైకును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన టీచర్ (video)

అబ్బా.. నారా లోకేష్ పేరు, ఫోటోను డీపీగా పెట్టి రూ.54లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments