Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శైలజారెడ్డి అల్లుడు'కి డేట్ ఫిక్స్... భార్యాభర్తల మధ్య పోటీ?

అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం "శైలజారెడ్డి అల్లుడు". ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటి రమ్యకృష్ణ అత్తగా నటించింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఈనెల 31వ తేదీ

Webdunia
ఆదివారం, 26 ఆగస్టు 2018 (13:32 IST)
అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం "శైలజారెడ్డి అల్లుడు". ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటి రమ్యకృష్ణ అత్తగా నటించింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఈనెల 31వ తేదీన విడుదల కావాల్సి వుంది. అయితే, అనివార్య కారణాల రీత్యా ఈ చిత్రం విడుదలను వాయిదా వేశారు.
 
అయితే కేరళలో రీ రికార్డింగ్ చేస్తోన్న గోపీ సుందర్, వరదల కారణంగా సకాలంలో తన పనిని పూర్తిచేయలేకపోయాడు. దాంతో ఈ సినిమా ముందుగా అనుకున్నట్టుగా ఈ నెల 31వ తేదీన థియేటర్లకు రావడం లేదు. "వినాయక చవితి" సందర్భాన్ని పురస్కరించుకుని వచ్చేనెల 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారనేది తాజా సమాచారం. 
 
అదే రోజున 'యూ టర్న్', 'నన్నుదోచుకుందువటే' సినిమాలు విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. యుటర్న్ చిత్రం నాగచైతన్య సతీమణి, టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం కావడం గమనార్హం. సో, సెప్టెంబరు 13న భార్య సమంతతో నాగచైతన్య పోటీపడేందుకు సిద్ధమయ్యారన్నమాట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దివ్వెల మాధురి నోట్లో దువ్వాడ శ్రీనివాస్ సమోసా (video)

మై హోమ్ లడ్డూ.. రూ.51,77,777లకు వేలం- గణేష్ అనే వ్యక్తికి సొంతం

Ganesh immersion DJ Sound: డీజే సౌండ్‌తో అదిరిన యువకుడి గుండె ఆగిపోయింది

నరసాపూర్ - చెన్నై ప్రాంతాల మధ్య మరో వందే భారత్ రైలు

ఒకటికి మించి ఓటరు గుర్తింపు కార్డులు ఉంటే సరెండర్ చేయాలి : ఈసీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments