Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొక్కిసలాట కేసులో బాలీవుడ్ బాద్ షాకు ఊరట

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (08:46 IST)
వడోదర రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటకు కారణమయ్యారని పేర్కొంటూ నమోదైన కేసులో బాలీవుడ్ అగ్రహీరో షారూక్ ఖాన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. తద్వారా ఈ కేసులో బాలీవుడ్ బాద్ షాకు పెద్ద ఊరట లభించినట్టయింది. 
 
గత 2017లో "రాయిస్" చిత్ర ప్రమోషన్‌లో భాగంగా షారూక్ తన చిత్ర బృందంో కలిసి ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆయనను చూసేందుకు వడోదర రైల్వే స్టేషన్‌కు పోటెత్తారు. షారూక్ వారిపై టీషర్టులు, స్మైలీ బాల్స్ విసిరారు. వీటిని చేజిక్కించుకునే ప్రయత్నంలో ఒక్కసారిగా రైల్వే స్టేషనులో తొక్కిసలాట చోటుచేసుకుంది. 
 
ఈ తొక్కిసలాట ఘటనకు షారూక్ ప్రధాన కారకుడని పేర్కొంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జితేంద్ర మధుబాయ్ సోలంకి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును కొట్టివేయాల్సిందిగా కోరుతూ షారూఖ్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేసును విచారించిన కోర్టు షారూఖ్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. 
 
గుజరాత్ హైకోర్టు తీర్పును ఫిర్యాదుదారుడు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. నిన్న దీనిని విచారించిన జస్టిస్ రస్తోగి, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం షారూఖ్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. గుజరాత్ హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments