Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో పెండ్లి చేసుకున్నా స‌ర్దుకుపోతున్నారు - సుమంత్‌

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (11:19 IST)
Sumant
సుమంత్ క‌థానాయ‌కుడు గురించి అంద‌రికీ తెలిసిందే. తొలిప్రేమ’ హీరోయిన్‌ కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కీర్తిరెడ్డి రెండో పెళ్లి చేసుకోగా, సుమంత్‌ మాత్రం ఇంకా రెండో పెళ్లి చేసుకోలేదు. ఒంట‌రిగానే త‌న తాత‌య్య అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ఇంటిలోనే వుంటున్నాడు. విడాకుల త‌ర్వాత న‌టుడిగా చాలాకాలం గేప్ తీసుకున్న ఆయ‌న త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన విడాకుల క‌థ‌ను విని వెంట‌నే ఓకే చేశాడు. ఆ చిత్ర‌మే “మళ్ళీ మొదలైంది”. టీజీ కీర్తికుమార్‌ దర్శకత్వంలో, ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకం మీద రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుద‌ల‌కాబోతుంది. 
 
దీనికి సంబంధించిన ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఆయ‌న ఓ ఛానల్ తో మాట్లాడుతూ, విడాకులు అనేవి ప్ర‌స్తుతం స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయాయి. చాలాచోట్ల ఇవి జ‌రుగుతున్నాయి. మంచో చెడో తెలీదుకానీ మా కుటుంబంలోనూ ఇవి జ‌రిగాయి. అందుకే ద‌ర్శ‌కుడు విడాకుల క‌థ చెప్ప‌గానే బాగా క‌నెక్ట్ అయ్యాను. క‌థ ప్ర‌కారం ప్ర‌మోష‌న్‌కూడా డిఫ‌రెండ్‌గా వుండాల‌ని.. అప్ప‌ట్లో సినిమా విడుద‌ల‌కు ముందు వెడ్డింగ్ కార్డ్‌కూడా విడుద‌ల‌చేశాం. అంటూ అప్ప‌టి క‌బుర్లు చెప్పాడు. 
 
ప్రేమ అనేది సినిమాల్లో చూపించేదిగా బ‌య‌ట వుండ‌దు. క్యాలికేష‌న్స్ మారిపోతుంటాయి. ఒక‌వేళ రెండో మేరేజ్ చేసుకున్నా అక్క‌డా కొన్ని క‌ష్టాలుంటాయి. కానీ అవి బ‌య‌ట‌ప‌డ‌కుండా చాలా మంది స‌ర్దుకుపోతుంటారు.  నాకు అంత ఓపిక‌లేదు. అందుకే నేను పెండ్లికి దూరంగా వుండాల‌నుకున్నాను అని క్లారిటీ ఇచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments