Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మ 'మర్డర్‌'కు కోర్టు ముకుతాడు - సినిమా విడుదలకు బ్రేక్

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (15:23 IST)
తెలుగు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు కోర్టు షాకిచ్చింది. ఆయన నిర్మించిన 'మర్డర్' సినిమా విడుదలకు బ్రేక్ వేసింది. రెండేళ్ల క్రితం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పెరుమాల్ల ప్రణయ్ అనే యువకుడి హత్య ఆధారంగా మర్డర్ అనే పేరుతో సినిమా తెరకెక్కించారు. 
 
తమ ప్రేమకథను నేపథ్యంగా తీసుకుని సినిమా తీయడంపై అభ్యంతరం తెలుపుతూ ప్రణయ్ భార్య అమృత నల్గొండ కోర్టును ఆశ్రయించింది. తమ అనుమతి లేకుండా ఫొటోలు, పేర్లు వాడుకుంటూ సినిమా తీస్తుండటంపై ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై కేసు విచారణ జరిపే వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సినిమాకు తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్లయింది. 
 
ఈ నెల 6న అమృత కోర్టును ఆశ్రయించి నిర్మాతలు నట్టి క్రాంతి, నట్టి కరుణలకు నోటీసులు పంపారు. రాంగోపాల్‌ వర్మ సైతం నిర్మాణ భాగస్వామిగా కొనసాగుతుండగా ఆయనకు అమృత నోటీసు పంపలేదు. సినిమా విడుద‌లను నిలుప‌ద‌ల చేయాల‌ని, ప‌బ్లిసిటీ వెంట‌నే ఆపమ‌ని కోరుతూ అమృత‌ కోర్టును కోరారు.
 
 కాగా, సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ విడుదల కాగా, సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. త్వరలోనే చిత్రాన్ని ఓటీసీ ఫ్లాట్‌ ఫామ్‌, ఆర్టీవీ వరల్డ్‌ టీవీలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకుముందుకు రాంగోపాల్‌ వరకు సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌ సీఈసీ జరిమానా విధించింది. అనుమతి లేకుండా 'పవర్ స్టార్' మూవీ పోస్టర్లను పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments