Webdunia - Bharat's app for daily news and videos

Install App

థ్రిల్లర్ క‌థ‌తో సాయిధరమ్‌తేజ్‌రీ ఎంట్రీ

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (14:36 IST)
Sayidharam Tej
ఆ మధ్య  సీరియస్‌ యాక్సిడెంట్‌ని ఫేస్‌ చేసిన సాయధరమ్‌తేజ్‌ మెల్లిమెల్లిగా కోలుకున్నారు. రికవరీ మోడ్‌లో కొన్నాళ్ల  పాటు ఆయన బ్రేక్‌ తీసుకున్నారు. పూర్తిగా కోలుకున్నాక షూటింగ్‌ సెట్స్ కి హాజరవుతున్నారు. రీఎంట్రీలో ఆయనకు సెట్స్ లో గ్రాండ్‌ వెల్‌కమ్‌ అందింది.
ప్రస్తుతం కార్తిక్‌ దండు డైరక్షన్‌లో సినిమా చేస్తున్నారు సాయిధరమ్‌తేజ్‌. 
 
స్టార్‌ ప్రొడ్యూసర్‌ బీవీయస్‌యన్‌ ప్రసాద్‌, క్రియేటివ్‌ డైరక్టర్‌ సుకుమార్‌ కలిసి నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నారు సాయిధరమ్‌తేజ్‌. ఎస్‌వీసీసీ, సుకుమార్‌ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. శామ్‌దత్‌ షైనుద్దీన్‌ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. క్యూరియాసిటీ పెంచే మిస్టిక్‌ థ్రిల్లర్‌ ఇది. షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది.
 
ఫ్యాన్స్ కోసం మేకర్స్ బిహైండ్‌ ద సీన్స్ పిక్చర్‌ని విడుదల చేశారు. లైట్‌, షాడో మధ్య కనిపిస్తోంది పిక్చర్‌. డీప్‌ షాడోస్‌లో మేకర్స్ ఫ్రేమ్‌ పెట్టినట్టు అర్థమవుతోంది. 25 రోజుల్లో 30 శాతం సినిమా షూటింగ్‌ పూర్తయింది. టీమ్‌ పడ్డ శ్రమ ఎలాంటిదో దీన్ని బట్టి అర్థమవుతుంది.
 
సాయి కెరీర్‌లో చేస్తున్న ఫస్ట్  మిస్టిక్‌ థ్రిల్లర్‌ ఇది. ఆయన ఫ్యాన్స్ తో పాటు, సినీ వర్గాల్లోనూ ఆ ఎగ్జయిట్‌మెంట్‌ కనిపిస్తోంది. ఫస్ట్ లుక్‌ చూసి అందరూ ఫిదా అయ్యారు. ఆ క్యూరియాసిటీతోనే సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు.
 
బ్లాక్‌ మ్యాజిక్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. వరుస చావులకు కారణం తెలుసుకోవడానికి ఓ విలేజ్‌కి వెళ్లిన హీరో  కథే ఈ సినిమా. 'సిద్ధార్థి నామ సంవత్సరే, బృహస్పతి సింహరసౌ స్థిత సమయే, అంతిమ పుష్కరే' అంటూ పోస్టర్‌ మీద రాసిన మాటలు ఆకట్టుకుంటున్నాయి. హిందూ కాలమానం ప్రకారం 53వ సంవత్సరంలో జరిగిన విషయాలను గుర్తు చేస్తున్నాయి.
సినిమా ఆద్యంతం అద్భుతంగా వస్తోందని అంటున్నారు మేకర్స్. త్వరలోనే మిగిలిన విషయాలను వెల్లడిస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూకే పర్యటన కోసం పర్మిషన్ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు

Madhavi Latha: తాడిపత్రి వాళ్లు పతివ్రతలు కాబట్టి సినిమాల్లోకి రాకండి.. మాధవీ లత

పవన్ కల్యాణ్‌కు తలనొప్పి తెస్తున్న రేవ్ పార్టీలు.. మళ్లీ కొత్త కేసు.. ఎక్కడ?

Kumari Aunty : కుమారి ఆంటీ వ్యాపారంతో ట్రాఫిక్ జామ్.. వారం పాటు బంద్..

చైనాను చుట్టేస్తున్న HMPV వైరస్, లక్షణాలేంటి? భారత్ పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments