Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కష్టాల్లో మోహన్ లాల్: నెంబర్ 1 హీరోకు జైలు శిక్షా?

Advertiesment
కష్టాల్లో మోహన్ లాల్: నెంబర్ 1 హీరోకు జైలు శిక్షా?
, సోమవారం, 13 జూన్ 2022 (14:14 IST)
మలయాళం సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని నెంబర్ 1 హీరో.. దశాబ్దాల సినీ కెరీర్‌లో ఒక్క రీమార్క్ కూడా లేకుండా అదరగొట్టారు మలయాళ నటుడు మోహన్ లాల్. తాజాగా ఆయన వివాదంలో చిక్కుకున్నారు. గతంలో మోహన్ లాల్ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. 
 
సుదీర్ఘంగా రెండు రోజుల పాటు జరిపిన ఈ విచారణలో మోహన్ లాల్ ఇంట్లో ఏనుగు దంతాలు దొరకడం అప్పట్లో పెద్ద కలకాలమే రేపింది. నేషనల్ మీడియా కూడా దీని పై అప్పట్లో కవరేజి ఇచ్చింది. కానీ ఐటీ అధికారులు మాత్రం మోహన్ లాల్‌పై ఎలాంటి ఫిర్యాదు చెయ్యకుండా వదిలేసింది.
 
సాధారణంగా ఏనుగు దంతాలు ఒక్కరి ఇంట్లో పదిలపరచడం చట్టరిత్యా చాలా పెద్ద నేరం..దీనికి చట్టం ప్రకారం 3 నుండి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఐటీ అధికారులు ఈ అంశంని తేలికగా తీసుకున్నప్పటికీ.. అటవీశాఅఖ అధికారులు మాత్రం చాలా సీరియస్‌గా తీసుకొని మోహన్ లాల్‌పై పోలీస్ కేసు పెట్టారు.
 
గతంలో ఈ కేసు విచారణకి థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవడానికి అనుమతి లేదు అని ట్రయిల్ కోర్టు విచారణకి నిరాకరించింది హైకోర్టు. అయితే ఇప్పుడు ప్రజాప్రయోజనాలు వ్యాఖ్యలకు చెందిన ఇద్దరు వ్యక్తులు పిటిషన్‌ని దాఖలు చెయ్యడం తో కేరళ హై కోర్టు వారి వాదనని వినడానికి అనుమతిని ఇచ్చింది.
 
దీనితో మళ్ళీ ఈ కేసు తలనొప్పి మోహన్ లాల్‌కి పట్టుకుంది. ఈ కేసులో తమ అభిమాన హీరో కి జైలు శిక్ష పడితే తట్టుకోలేము అని మోహన్ లాల్ అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా కంటతడి పెడుతున్నారు.
 
ఇక మోహన్ లాల్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆయన మరక్కార్ అనే సినిమాని విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. 
 
ఆ తర్వాత మోహన్ లాల్ నటించిన బ్రో డాడీ సినిమా డిస్నీ + హాట్ స్టార్ లో విడుదల అయ్యి మంచి రెస్పాన్స్‌ని దక్కించుకుంది..ప్రస్తుతం ఆయన చేతిలో 5 సినిమాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో మోహన్ లాల్ జైలుకి వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉండడంతో ఆయన నిర్మాతలు కంగారు పడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చప్పట్లు, విజిల్స్, ఫ్యాన్స్ కోసం విరాటపర్వం చేశా - రానా దగ్గుబాటి