Webdunia - Bharat's app for daily news and videos

Install App

సత్య దేవ్, ప్రియా భవానీ శంకర్ 'జీబ్రా' ఫస్ట్ సింగిల్ రిలీజ్

డీవీ
సోమవారం, 4 నవంబరు 2024 (17:51 IST)
Satya Dev, Priya Bhavani Shankar
హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్, మోషన్ వీడియో, టీజర్‌తో మేకర్స్ క్యూరియాసిటీని పెంచుతూ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. టీజర్ మంచి రెస్పాన్స్ తో భారీ అంచనాలను నెలకొల్పింది.
 
ఈ రోజు మేకర్స్ ఫస్ట్ సింగిల్ మేరీ తేరీ సాంగ్ ని రిలీజ్ చేశారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ సాంగ్ ని మెస్మరైజింగ్ మెలోడీ గా కంపోజ్ చేశారు.
 
పూర్ణా చారి రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. విజయ లక్ష్మి, సంతోష్ వెంకీ తమ ప్లజెంట్ వోకల్స్ తో లైవ్లీగా పాడారు. ఈ సాంగ్ లో సత్య దేవ్, ప్రియా భవానీ శంకర్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది. విజువల్స్ కూల్ అండ్ సూపర్బ్ గా వున్నాయి. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది.
 
లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, సత్య అక్కల, జెన్నిఫర్ పిషినాటో, సునీల్, కీలక పాత్రలు పోషించారు.
 
ఈ చిత్రానికి సత్య పొన్మార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎస్ శ్రీలక్ష్మి రెడ్డి సహ నిర్మాత. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటర్.  
 
జీబ్రా మూవీ నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది.
 
నటీనటులు:సత్య దేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిషినాటో, సత్య అక్కల, సునీల్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని, శ్రీరెడ్డిలు పోయారు.. మా వారు తట్టుకుని నిలబడ్డారు.. నారా లోకేష్

చక్రం తిప్పిన పవర్ స్టార్.. ఆయన వల్లే గెలిచానన్న దేవేంద్ర బహిరంగ ప్రకటన (video)

జగన్‌ హయాంలో భూ ఆక్రమణలు.. వదిలిపెట్టేది లేదన్న పవన్ కల్యాణ్

30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments