సాయి దుర్గ తేజ్18లో వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు

డీవీ
సోమవారం, 4 నవంబరు 2024 (17:35 IST)
Jagapathi Babu
హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18 చేస్తున్నారు. డెబ్యుటెంట్ రోహిత్ కెపి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. హనుమాన్ సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి  ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
 
మేకర్స్ లేటెస్ట్ గా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. రగ్గడ్ లుక్ లో ప్రెజంట్ చేసిన జగపతిబాబు ఇంట్రో పోస్టర్ చాలా క్యురియాసిటీ పెంచింది.
 
ఇటివలే రిలీజ్ చేసిన “ఇంట్రూడ్ ఇన్‌టు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ” వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఓ అద్భుతమైన ప్రపంచాన్ని క్రియేట్ చేయడంలో ప్రొడక్షన్ టీమ్ డెడికేషన్ ని ఈ వీడియో ప్రజెంట్ చేసింది.
 
#SDT18 లో సాయి దుర్గ తేజ్ మునుపెన్నడూ చేయని పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. మోస్ట్ ట్యాలెంటెడ్ ఐశ్వర్య లక్ష్మి ఈ హై-ఆక్టేన్, పీరియడ్-యాక్షన్ డ్రామాలో సాయి దుర్గ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. సెన్సేషనల్ కంపోజర్ బి. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించనున్నారు.  
 
ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా విడుదల కానుంది.  మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
 
తారాగణం: సాయి దుర్గ తేజ్, ఐశ్వర్య లక్ష్మి, జగపతిబాబు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండిగో సంక్షోభంపై నోరెత్తిన కేటీఆర్.. సంపద కొన్ని సంస్థల చేతుల్లోనే కూరుకుపోయింది..

పుతిన్-మోడీ ఫ్రెండ్‌షిప్‌ని మా ట్రంప్ దృఢతరం చేసారు, ఇవ్వండి నోబెల్ అవార్డ్, ఎవరు?

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments