Webdunia - Bharat's app for daily news and videos

Install App

సత్య దేవ్, డాలీ ధనంజయ నటించిన జీబ్రా చిత్రం క్యారెక్టర్ రివీలింగ్ మోషన్-పోస్టర్

డీవీ
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (17:54 IST)
Zebra Character Revealing Motion-Poster
హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ మోస్ట్ ఎవైటెడ్ మల్టీ-స్టారర్ 'జీబ్రా'. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై SN రెడ్డి, S పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ఈ రోజు, మేకర్స్ ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్‌తో రిలీజ్ చేశారు, మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు.
 
మోషన్ పోస్టర్ సత్యరాజ్, సత్య అక్కల, జెన్నిఫర్ పిసినాటో, సునీల్, ప్రియా భవానీ శంకర్, డాలీ ధనంజయ, సత్య దేవ్‌లని పరిచయం చేసింది. ప్రతి పాత్రను ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్ తో ప్రజెంట్ చేశారు. మోషన్ పోస్టర్ చాలా క్యురియాసిటీని పెంచింది.
 
చివరి ఫ్రేమ్‌లలో మొత్తం నటీనటులు కనిపిస్తున్నారు. మోషన్ పోస్టర్‌లో కాయిన్ తిప్పడం, కరెన్సీ నోట్లు,  ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నుండి కారు దూకడం వంటి ఎక్సయిటింగ్ డైనమిక్ ఎలిమెంట్స్ క్రియేటివ్ గా ప్రజెంట్ చేశారు. రవి బస్రూర్ అందించిన ఇంటెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్ ని మరింత పెంచింది. ఈ మైండ్ బ్లోయింగ్ మోషన్ పోస్టర్ ద్వారా జీబ్రా అక్టోబర్ 31న అన్ని దక్షిణ భారత భాషల్లో,హిందీలో థియేటర్లలోకి రానుందని అనౌన్స్ చేశారు. ఈ రిలీజ్ డేట్ ఈ దీపావళి మరింత స్పెషల్ వుండబోతోందని ప్రామిస్ చేస్తోంది.    
 
లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సత్య పొన్మార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎస్ శ్రీలక్ష్మి రెడ్డి సహ నిర్మాత. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటర్.
 
తారాగణం: సత్య దేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్ పిసినాటో, సత్య అక్కల, సునీల్ తదితరులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments