Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ‌రీషా... ఈ ప్రీ టీజ‌ర్ ఏంటి నాయ‌నా..? ఈ కొత్త ప్లాన్ అందుకేనా..?

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (15:34 IST)
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హరీష్ శంకర్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం వాల్మీకి. తమిళ చిత్రం జిగర్తాండకు ఇది రీమేక్. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వ‌హించిన‌ ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో వాల్మీకి పేరుతో హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్ బ్యాన‌ర్ పైన రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. 
 
ఈ మూవీ ప్రీ-టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రంజాన్ పండుగను పురష్కరించుకుని దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా వాల్మీకి గురించి ఓ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అది ఏంటంటే... ఈ పవిత్రమైన రోజున వాల్మీకి టీమ్ తరఫున ఈ ప్రకటన చేయడం ఆనందంగా ఉంది. ప్రీ-టీజర్‌తో అతి త్వరలో మీకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాం అని అన్నారు. 
 
వాల్మీకి సినిమాని ఎనౌన్స్ చేయ‌గానే... వాల్మీకి కులానికి చెందిన కొంతమంది త‌మ మ‌నోభావాలు దెబ్బ‌తింటాయి. ఈ సినిమాకి వాల్మీకి అని టైటిల్ పెట్ట‌డం ఏంటి..? మార్చాలి అన్నారు ఆ విధంగా వార్త‌ల్లో నిలిచింది. త‌ర్వాత పూజా హేగ్డే ఈ సినిమా గురించి ఎక్కువ రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేసింది. అందుచేత నో చెప్పింది అని మ‌రోసారి వాల్మీకి వార్త‌ల్లో నిలిచింది.

కొన్ని రోజులుగా వాల్మీకి వార్త‌ల్లో లేడు. అందుచేత కొత్త‌గా ఉంటుంది.. మ‌రోసారి వార్త‌ల్లో ఉంటుంది అనుకున్నారనుంటా... హ‌రీష్ శంక‌ర్ ప్రీ టీజ‌ర్ అంటూ వీడియో రిలీజ్ చేయ‌బోతున్నాడ‌ట‌. ప్లాన్ బాగానే ఉంది. ప్రీ టీజ‌ర్ ఎలా ఉంటుందో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments