Webdunia - Bharat's app for daily news and videos

Install App

తోపు, తురుం అని ఫీలింగా.. కమెడియన్ ఛలోక్తులు

Webdunia
గురువారం, 18 ఏప్రియల్ 2019 (16:35 IST)
సత్యదేవ్, పూజా ఝవేరి, రోహిణి ప్రకాష్ హీరో హీరోయిన్లుగా ప్రదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం '47 డేస్'. టైటిల్ కార్డ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దబ్బర శశి భూషణ్ నాయుడు, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సత్యదేవ్ అసిస్టెంట్ కమీషనర్‌గా కనిపించబోతున్నాడు. 
 
ఇటీవల జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన కమెడియన్ ప్రియదర్శి మాట్లాడిన తీరు అందరికీ నవ్వు తెప్పించింది. 'ఈ ఈవెంట్‌కు రావడానికి కారణం ఈ స్టేజీపై ఉన్న సతీష్‌గారు, ఆయనే నాకు లైఫ్ ఇచ్చారు. రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ నా ఫేవరెట్ యాక్టర్స్, వారి కోసం వచ్చాను. సత్యదేవ్ అనే నటుడు అసలు ఎవడో నాకు తెలవదు. వాడికి పెద్ద తోపు అని ఫీలింగ్. ఇండస్ట్రీలో అంతా పెద్ద తోపు, తురం ఖాన్ యాక్టర్ అని అనుకుంటారట. 47 డేస్.. ఇదేం టైటిల్, నాకు అర్థం కావట్లేదు. ప్రదీప్ గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. హైదరాబాద్‌లో నా లాంటి మంచి యాక్టర్ ఉన్నప్పుడు అలాంటో హీరోగా ఎలా తీసుకున్నావో తెలియట్లేదు. ప్రకాష్ రాజ్ లెవల్ యాక్టర్ అవుదామని వచ్చిండట ఈ సత్యగాడు' అంటూ ప్రియదర్శి ఛలోక్తులు విసిరి నవ్వు తెప్పించారు.
 
ట్రైలర్‌ను చూస్తే అందులో, ‘‘నా పేరు సత్య.. అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్. నాకు తెలిసి లైఫ్ కంటే మిస్టరీ ఏమీ లేదు. కానీ అంతకంటే పెద్ద మిస్టరీ నా జీవితంలోకి వచ్చింది. నా గతాన్ని వెలికి తీసి నా ప్రస్తుతాన్ని వెంటాడుతోంది'' అంటూ ఇంట్రెస్టింగ్ డైలాగ్స్‌తో ఆసక్తికరంగా ఉంది. 47 రోజుల్లో అసిస్టెంట్ కమీషనర్ సత్య తన జీవితంలోని మిస్టరీని ఛేదించే క్రమంలో థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో హరితేజ, రవి వర్మ, శ్రీకాంత్ ఐయ్యంగార్, ఇర్ఫాన్, బేబీ అక్షర, ముఖ్తార్ ఖాన్, కిరీటి, అశోక్ కుమార్ వంటి యాక్టర్లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments