Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు వారి పాట నుంచి శివరాత్రికి గిఫ్ట్.. వీడియో రిలీజ్ కానుందట!

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (11:11 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాటలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా దుబాయ్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల దుబాయ్‌లో మొదటి షెడ్యూల్ పూర్తి అయింది. వెంటనే రెండో షెడ్యూల్ ప్రారంభం అయింది. ఈ రెండో షెడ్యూల్ ఈ నెల 21 వరకు కొనసాగనుంది. 
 
ఈ షెడ్యూల్ కోసం ఇటీవల కీర్తి సురేష్ దుబాయ్ చేరుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ అప్‌డేట్ రానుందంట. అది కూడా శివరాత్రి సందర్భంగా మార్చి 11న రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఓ చిన్న వీడియోను రిలీజ్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. 
 
ఈ వీడియోలో మహేష్ తన సినిమాలోని ప్రత్యేకమైన బైట్ ఇవ్వబోతున్నారని, చిత్రీకరణలోని ఆఫ్ కెమెరా మేకింగ్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ విషయంలో క్లారిటీ కావాలంటే శివరాత్రి వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments